ముంచుకొస్తున్న మరో ముప్పు

– బంగళాఖాతం లో అల్పపీడనం.-

ఎల్లుండి నుంచి భారీ వర్షాలు

Date:29/11/2020

అమరావతి ముచ్చట్లు:

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. డిసెంబరు 2న దక్షిణ తమిళనాడు తీరాన్ని తాకే అవకాశం ఉంది. దాని ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమ లో మోస్తరు వర్షాలు కురువనున్నాయి. నేడు, రేపు తెలంగాణలో పొడి వాతావరణం ఉండనుంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాగల 48 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారి.. డిసెంబర్‌ 2న దక్షిణ తమిళనాడు- పాండిచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని పేర్కొంది.మంగళ, బుధవారాల్లో తమిళనాడు, పుదుచ్చేరి కరైకల్‌, మహే, లక్షద్వీప్‌, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ తీరం, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించాయి.అటు, అల్పపీడన ప్రభావంతో డిసెంబరు 1 నుంచి తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతంలో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

మంత్రి పేర్ని నానికి తృటిలో తప్పిన ప్రమాదం

Tags; Another threat of drowning

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *