Another unexpected shock to the drugmakers in AP

ఏపీలో మందుబాబులకు మరో ఊహించని షాక్

Date:05/05/2020

అమరావతి ముచ్చట్లు:

మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో ఊహించని షాకిచ్చింది. ఇప్పటికే 25 శాతం మద్యం పెంచిన ప్రభుత్వం.. తాజాగా మరో 50 శాతం పెంచింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి మంగళవారం నాడు ఉత్వర్వులు వెలువడ్డాయి. అంటే ఇప్పటి వరకూ మొత్తం 75 శాతం పెంచిందన్న మాట. నిన్నటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. ఈ పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

 

ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది. అమ్మకాలు మళ్లీ ఎప్పట్నుంచి ప్రారంభించాలనే దానిపై తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు నిలిపివేయాలని కమిషనర్‌ తెలిపారు. మద్యం షాపుల వద్ద రద్దీని తగ్గించడం, సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవడంపై దృష్టిపెట్టాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయం నిర్ణయించింది. రద్దీని తగ్గించేందుకు టోకెన్‌ పద్ధతిని అమలు చేసే అంశంపై పరిశీలించారు. వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో 50 నుంచి 70 శాతం వరకు మద్యం ధరలు పెంచారని పలువరు అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అన్ని అంశాలను పరిశీలించి ఫైనల్‌గా మార్గదర్శకాలను ఉదయం 11గంటలకు జారీ చేసింది.

పంట నష్ట పోకుండా చర్యలు

Tags: Another unexpected shock to the drugmakers in AP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *