Natyam ad

లోన్ యాప్ ఆగడాలకు మరోకరి బలి

-న్యూడ్ ఫొటోలను షేర్ చేయడంతో యువకుడి సూసైడ్

జి కొండూరు ముచ్చట్లు:


తాజాగా లోన్యాప్ నిర్వాహకుల వేధింపులకు మరో ప్రాణం బలైంది.  కుటుంబంతో కలిసి పండుగకు వస్తాడనుకున్న కొడుకు శవంగా మారడంతో ఆ తల్లిదండ్రులను కలచివేసింది.  ఎంబీఏ చదివిన బిడ్డ అమాయకంగా రుణయాప్ కు బలవుతాడని  ఆ కుటుంబం అస్సలు ఊహించలేదు. నా బిడ్డకు జరిగిన అన్యాయం మరి ఎవరికీ జరగకూడదు అంటూ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.వివరాల్లోకి వెళితే ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం వెలగలేరుకు చెందిన రాజేష్ ఎంబీఏ పూర్తి చేశాడు.  పెళ్లి తర్వాత రాజేష్ హైదరాబాద్ లోని  ఓ ప్రయివేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు.  అతని భార్య కూడా ఉద్యోగం చేస్తోంది. వీరికి మూడేళ్ల కుమార్తె కూడా ఉంది.  కుటుంబ అవసరాల కోసం ఎక్స్పీ క్యాష్ అనే రుణయాప్ నుంచి లోన్ తీసుకొని తిరిగి చెల్లించాడు రాజేష్.  అయినా సరే లోన్ యాప్ కంపెనీ వేధింపులు ఆగలేదు.  అతని న్యూడ్ ఫొటోలను సైతం కుటుంబ సభ్యులకు పంపించడంతో మనస్థాపానికి గురైన రాజేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.  ఆత్మహత్యకు ముందు సూసైడ్ నోట్ కూడా రాశాడు రాజేష్.  సీఎం కేసీఆర్ .. ప్రధాని మోడీ లోన్ యాప్ నిర్వాహకులలపై కఠిన చర్యలు తీసుకోవాలని..తనలా మరెవరు బలి కాకూడదు అంటూ సూసైడ్ నోట్లో అభ్యర్ధించాడు రాజేష్.

 

Post Midle

Tags: Another victim of loan app delays

Post Midle

Leave A Reply

Your email address will not be published.