లోన్ యాప్ దురాగతాలకు మరో యువకుడి బలి
కరీంనగర్ ముచ్చట్లు:
లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ లోని సాయి నగర్ కు చెందిన శ్రీరాముల శ్రవణ్ (33) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అంబేడ్కర్ స్టేడియం లో గడ్డి మందు తాగి పడిపోయాడు. శ్రవణ్ ను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కూరగాయల వ్యాపారం చేసే శ్రవణ్ లోన్ యాప్ లో అవసరాల కోసం మూడు లక్షలు లోన్ తీసుకున్నాడు. స్నేహితులకు అప్పుగా ఇచ్చి తిరిగి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కోన్నాడు. లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులతో మనస్తాపం చేందాడు. మృతునికి భార్య ఇద్దరు కుమారులు వున్నారు. వన్ టౌన్ పోలీసులకు లో భార్య ఫిర్యాదు చేసింది.
Tags: Another young victim of loan app atrocities

