రోజా విమర్శలకు అనురాధ కౌంటర్
విజయవాడ ముచ్చట్లు:
భువనేశ్వరి నిజం గెలవాలి యాత్రపై మంత్రి రోజా విమర్శలకు టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ కౌంటర్ ఇచ్చారు.గతంలో బ్యాంకు అకౌంట్లలో డబ్బుల్లేక చెక్ బౌన్స్ లు అయ్యే స్థితిలో ఉన్న రోజా ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని సూటిగా ప్రశ్నించారు. సీబీఐ ఎంక్వయిరీ కోరే దమ్ము రోజాకు ఉందా అని అడిగారు. పోనీ తనపై ఉన్న కేసుల్లో త్వరగా ఎంక్వయిరీ పూర్తి చేయాలని సీబీఐ, ఈడీని కోరే దమ్ము సీఎం జగన్ కి ఉందా అని ప్రశ్నించారు అనురాధ.ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి, మంత్రిగా రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించారు ఎమ్మెల్సీ అనురాధ.

Tags: Anuradha counters Roja’s criticism
