ధర్మవరంలో అందోలన
ధర్మవరం ముచ్చట్లు:
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు, నిరసనలు రోజురోజుకు ఉద్ధృతమవుతున్నాయి.. కొన్నిచోట్ల జిల్లా కేంద్రాలుగా తమ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్
చేస్తుండగా.. మరికొన్నిచోట్ల జిల్లా పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా అంతపురం జిల్లా ధర్మవరం రెవెన్యూ డివిజన్ను రద్దుచేయడాన్ని నిరసిస్తూ టిడిపి నేత పరిటాల శ్రీరామ్ నిరాహారదీక్ష
చేపట్టారు. ఎన్టీఆర్ కూడలి నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాప్తాడు నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల ప్రజలు మద్దతు తెలుపుతూ ర్యాలీలో పాల్గొన్నారు. రెవెన్యూ
డివిజన్ కొనసాగించాలని నినాదాలు చేశారు.
Tags: Anxiety in Dharmavaram