టీడీపీ శ్రేణుల అందోళన
చిత్తూరు ముచ్చట్లు:
చిత్తూరు జిల్లా టూ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మాజీ మేయర్ కటారి హేమలతపై పోలీసు వాహనాన్ని ఎక్కించిన పోలీస్ అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులపై ఆందోళనకారులు ఎదురుదాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువురికి మధ్య తోపులాట తొక్కిసలాటలు చోటు చేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా పోలీసు వాహనాల్లో ఎక్కించి తరలించే ప్రయత్నాన్ని టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.
Tags: Anxiety of TDP series