బాగోగులు చూసేవారు లేరని బెంగ
-వికలాంగ కొడుకు, అనారోగ్యం పాలైన తల్లి ..
పురుగుల మందు తాగించి, తాను తాగి ఆత్మహత్య
కరీంనగర్ ముచ్చట్లు:
నవమాసాలు మోసి, వికలాంగుడైన కొడుకును జీవితాంతం సాకిన తల్లి , తన భారం మరొకరి భారం కాకుడనుకుందో ,ఆందోళన చెందిందో తెలియదు కానీ ఆనారోగ్యం పాలైన ఓ వృద్ద తల్లి తన వికలాంగుడైనకొడుకు విషయంలో కఠిన పాషాణ నిర్ణయం తీసుకుంది…తాను చనిపోతే కొడుకు బాగోగులు ఎవరు చూసుకుంటారని కలత చెందింది… కొడుక్కి పురుగుల మందు తాగించి తాను సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. మొదట కొడుకు మృతి చెందగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది….కరీంనగర్ జిల్లాలో జరిగిన ఈ ఘటన హృదయాలను భారం చేస్తుంది.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కేశవపూర్ కు చెందిన ముషిక మధు నమ్మకు (70) కుమార్తె, కొడుకు (వికలాంగుడు) కుమార్ (27) ఉన్నారు. భర్త పది సంవత్సరాల క్రితంఆనారోగ్యంతో మృతి చెందాడు. కొడుకు బాగోగులు చూసుకుంటూ ఇంటి వద్ద ఉంటుంది. కుమార్తెకు వివాహాం కావడంతో జమ్మికుంట మండలం మాచనపల్లిలో భర్తతో కలిసి ఉంటుంది. ఇటీవల కుమార్తెఇంటికి కొడుకును తీసుకొని వెళ్ళింది. అక్కడ తీవ్ర ఆనారోగ్యానికి గురి అయింది. తనకు ఏమైన జరుగ రానిది జరిగితే నా కొడుక్కు దిక్కు ఎవరని మధనపడింది. దీంతో చావే శరణ్యం అని భావించింది. ఇంట్లోఉన్న పత్తి మందు కొడుక్కు తాగించి, తర్వాత తాను తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. కొడుకు అక్కడికి అక్కడే మృతి చెందగా, తల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈహృదయ విధారకరమైన సంఘటన అందరిని కలిచి వేసింది.

Tags: Anxious that there are no good watchers
