ఎలాంటి దరఖాస్తు అయినా కేవలం 15నిమిషాలలోపే

Date:26/10/2020

హైద్రాబాద్ ముచ్చట్లు:

ఏదైనా అప్లయ్‌ చేయాలన్నా.. సర్టిఫికెట్‌ కావాలన్నా మనకు ముందుగా గుర్చొచ్చేది మీ సేవ. మరి అది ఎక్కడుందో? దరఖాస్తుకు ఎంత టైం పడుతుందో? దేనికెంత చార్జీ వేస్తారో? అసలు మీ సేవ తెరచి ఉందో.. వర్కింగ్‌ డేనా హాలిడే నా? ఇలా అనేక సందేహాలతో తికమకపడుతుంటాం. ఇక ఆ ఇబ్బందులన్నింటినీ తీర్చింది తెలంగాణ ప్రభుత్వం. మీసేవ 2.0 ‘సిటిజన్‌ సర్వీస్‌’ ద్వారా స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ లేదా కంప్యూటర్‌ సాయంతో మీ ఇంటినుంచే అన్ని సేవల్ని పొందే వెసులుబాటు కల్పించింది. కేవలం ఇంటర్నెట్‌ ఉంటే చాలు సేవల్ని సులభంగా, వేగంగా పొందవచ్చు. మీసేవ దరఖాస్తులు ఇక సొంతంగా చేసుకునే వెలుబాటును తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. గత ప్రభుత్వాల హయాంలో కేవలం కియోస్క్‌ ఆపరేటర్లు(మీసేవ నిర్వాహకులు), డిపార్టమెంట్‌ లాగిన్‌ల ద్వారా మాత్రమే సర్టిఫికెట్లు దరఖాస్తు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మీసేవలో సిటిజన్‌ సర్వీస్‌ను పొందుపర్చింది. దీంతో సిటిజన్స్‌(పౌరులు) ఎవరైనా మీసేవ ద్వారా తమకు కావాల్సిన అన్ని రకాల సర్టిఫికెట్లకు తమ మొబైల్‌ లేదా కంప్యూటర్‌ ద్వారా ఇంటి నుంచే ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.ముందుగా  సైట్‌ ఓపెన్‌ చేయాలి. అక్కడ మెనూలో లాగిన్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిపై క్లిక్‌ చేస్తే ‘మీసేవ 2.0’ కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్‌ అయ్యేందుకు మెనూ వస్తుంది.

 

 

కియోస్క్‌ ఉన్న చోట క్లిక్‌ చేస్తే కియోస్క్‌, సిటిజన్‌, డిపార్ట్‌మెంట్‌ ఇలా మూడు రకాల ఆప్షన్లను చూపిస్తుంది. మనం ‘CITIZEN’ను ఎంపిక చేసుకోవాలి. సిటిజన్‌ సర్వీస్‌ను ఎంచుకున్న తర్వాత కింద ఉండే New User ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తర్వాత ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్‌ ఐడీ, పాస్‌వర్డ్‌, కాంటాక్ట్‌ ఇన్ఫర్మేషన్‌ తదితరాలను అందులో పొందుపరిస్తే మొబైల్‌ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఈ ఓటీపీ ఒకసారి ఎంటర్‌ చేస్తే చాలు. ఇక మనం ఎల్లప్పుడూ మనకు కావాల్సిన సర్టిఫికెట్లను దరఖాస్తు చేసుకునేందుకు యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ జనరేట్‌ అవుతుంది. ఇలా లాగిన్‌ అయి టీఎస్‌ఆర్‌టీఏ, రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ, టీఎస్‌ ఎస్‌పీడీసీఎల్‌, పోలీస్‌, ప్రింట్‌ ఆప్షన్లు కనిపిస్తాయి.రెవెన్యూ ఆప్షన్‌లోకి వెళ్లగానే ఆపద్బంధు స్కీం, ఎక్స్‌ట్రాక్ట్‌ ఆఫ్‌ హౌస్‌సైట్‌ పట్టా, చిన్న, సన్నకారు రైతు సర్టిఫికెట్‌, బ్రాహ్మణ కుల ధ్రువీకరణ పత్రం, నివాసం, కులం, పుట్టినతేదీ, పొజీషన్‌, నివాసం, ఫ్యామిలీ మెంబర్‌, ఈబీసీ, నో ఎర్నింగ్‌ మెంబర్‌, ఆదాయం, ఓబీసీ, వ్యవసాయ ఆదాయ ధ్రువీకరణ పత్రం, వెనుకబడిన తరగతులకు చెందిన వర్గం వంటి పత్రాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా సర్టిఫైడ్‌ కాపీలు, నూతన వ్యవసాయ, తాగునీటి బావులు, నో ఆబ్జెక్షన్‌, ఎఫ్‌లైన్‌ పిటీషన్‌, ల్యాండ్‌ కన్వర్షన్‌(భూమి స్వభావం మార్పు), లేట్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫ్‌ బర్త్‌(పుట్టిన తేదీ), పేరు మార్పు,

 

 

 

వ్యవసాయ భూమి విలువ వంటి ఎన్నోరకాల సర్టిఫికెట్లకు కూడా ఇక్కడే దరఖాస్తు చేసుకోవచ్చు.పోలీస్‌ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తే మిస్సింగ్‌ ఆర్‌ లాస్ట్‌ డాక్యుమెంట్స్‌ (పోగొట్టుకున్న డాక్యుమెంట్లు), ఈవెంట్‌ బందోబస్తు, పోలీస్‌ చలాన్‌ పేమెంట్స్‌, ఫ్రెష్‌ లైసెన్స్‌ లేదా రెన్యువల్‌ ఆప్షన్లు ఉంటాయి. ఇందులో బార్లు, దాబాలు, త్రీ స్టార్‌, ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు, సాధారణ రెస్టారెంట్లు, హోటళ్లకు నూతన, రెన్యువల్‌ పర్మిషన్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా పబ్లిక్‌ మీటింగ్‌లు, ర్యాలీలు నిర్వహించేందుకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఎలాంటి ధ్రువీకరణ పత్రాలైనా, అనుమతులైనా నట్టింట్లో నుంచే దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ప్రతి పౌరుడికీ ప్రభుత్వం కల్పించింది.

 

 

‘మీసేవ’ లోగో కింద ‘సులభంగా.. వేగంగా’ అని ఉంటుంది. ఈ పదం సేవలు వినియోగించుకునే వారికి సరిగ్గా సరిపోతుంది. ఇంటర్నెట్‌ సౌకర్యం ఉన్న ప్రతీ కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ఫోన్‌ నుంచి సులభంగా ఎవరికి కావల్సిన సర్టిఫికెట్‌ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎలాంటి దరఖాస్తు అయినా కేవలం 15నిమిషాలలోపే దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ సమయంలోనే తమ అవసరాన్ని బట్టి ఏది కావాలంటే అది ఇందులోనుంచే పొందే వీలు కల్పించారు. ఇలా చేయడం వల్ల ఇంటినుంచే అన్నిరకాల దరఖాస్తులు చేసుకోగా అధికారులు ఆ దరఖాస్తులను విచారించి ధ్రువీకరణ, లేదా తిరస్కరణ వంటివి చేస్తా రు. ధ్రువీకరించిన సర్టిఫికెట్లను సమీపంలోని మీసేవకు వెళ్లి తీసుకోవచ్చు.

ఆసుపత్రి కంటే ఇల్లే పదిలం.. ముఖం చాటేస్తున్న రోగులు

Tags: Any application can be made in just 15 minutes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *