రైతుల కోసం ఎవరితోనైనా పోరాడతా

Anyone can fight for the farmers

Anyone can fight for the farmers

Date:26/11/2018
విజయవాడ ముచ్చట్లు:
రైతులకు అండగా లేని ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి అనంతపురం వరకు ఎక్కడ చూసినా రైతు కంట కన్నీళ్లే కనపడుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో జనసేన తరఫున అన్నదాతల కోసం ప్రత్యేకంగా సదస్సులు నిర్వహిస్తామన్నారు. ఆ సదస్సుల్లో వారి సమస్యలపై చర్చిస్తామని భరోసా ఇచ్చారు. ప్రజా పోరాట యాత్రలో భాగంగా కోనసీమ రైతులతో సమావేశమైన పవన్.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ప్రపంచీకరణ పేరుతో వ్యవసాయరంగాన్ని విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు పవన్. రైతులకు కావాల్సింది సింగపూర్ తరహా అభివృద్ది కాదని.. గిట్టుబాటు ధర అన్నారు. గిట్టుబాటు ధరలు కల్పించడం ప్రభుత్వాల బాధ్యత కాదా అని ప్రశ్నించారు. పండించిన పంటకు సరైన మద్దతు ధరలేక అన్నదాతలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతుకే ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు. మట్టిశక్తి తనకు తెలుసన్న జనసేనాని.. రెండు సెంట్ల పొలంలో వరి పండించానన్నారు.
ప్రభుత్వాలు రైతుల భూముల్ని దోచేశాయని ఆరోపించారు పవన్. సెజ్‌ల పేరుతో వైఎస్ దోపిడీ చేస్తే.. చంద్రబాబు బషీర్‌బాగ్‌లో రైతుల్ని కాల్చి చంపారని గుర్తు చేశారు. చివరికి కోనసీమలో కూడా పర్యావరణ విధ్వంసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ ప్రాంతంలతో పచ్చదనం పోయి.. అంతా ఆక్వామయం కావడం ఆందోళన కలిగిస్తుందన్నారు. కోనసీమలో చమురు, గ్యాస్ నిక్షేపాలను దోచేస్తున్నారని మండిపడ్డారు జనసేనాని. పెద్ద కొడుకుల్లాంటి కొబ్బరి తోటలు నేలమట్టం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాస్, చమురును దోచేస్తున్న బడా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాలు వంత పాడుతున్నాయని ఆరోపించారు జనసేనాని. ఇంత దోపిడీ జరుగుతున్నా.. చంద్రబాబు, జగన్ ఎందుకు స్పందించరని ప్రశ్నించారు. ఎందుకంటే ఆ పారిశ్రామికవేత్తలంటే వారికి భయమన్నారు. ఆ పారిశ్రామికవేత్తలు దేశాన్ని శాసిస్తారేమో.. వాళ్లకు జనసేన, పవన్ కళ్యాణ్ భయపడరన్నారు. మన గ్యాస్ నిక్షేపాలు మనకు దక్కాలి.. మన వాటా మనకు కావాలి’ అన్నారు. కోనసమీకు న్యాయం చేసేందుకు.. చమురు, గ్యాస్‌లో వాటా కోసం అంబానీలను ఎదిరిస్తానన్నారు పవన్.
Tags:Anyone can fight for the farmers

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *