ఎంతటి వారైనా సిబిఐ ముందు సమానులే-ఎంపి జీవిఎల్
విశాఖపట్నం ముచ్చట్లు:
భారతీయ జనతాపార్టీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంచల న కామెంట్స్ చేశారు. వైసీపీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారం పై స్పందించారు.ఎంపీ అరెస్ట్ పై ఎక్కు వగా ఆలోచించాల్సిన అవసరం లేద న్నారు. రాష్ట్రంలో సవాలక్ష సమస్యలు ఉన్నాయని,ముందుగా వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నా రు.కేంద్రానికి సీబీఐతో సంబంధం ఉండని,కేంద్ర దర్యాప్తు సంస్థ తన పని తాను చేసుకుంటూ వెళుతుందని చెప్పారు.సరైన ఆధారాలు ఉంటే రంగంలోకి దిగుతుందని , పక్కా ప్రూఫ్స్ తో అరెస్ట్ చేస్తుందని తెలిపారు. అరెస్ట్ చేసే ముందు వాళ్లు ఏ పార్టీకి చెందిన వారని చూడరని అన్నారు జీవీఎల్ నరసింహా రావు.బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాకే కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వేచ్ఛ లభించిందన్నారు జీవిఎల్.
Tags: Anyone is equal before CBI-MP GVL

