గవర్నర్ ను కలిసిన ఏపీ బీజేపీ బృందం

Date:23/11/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో భాజాపా ప్రతినిధుల బృందం  గవర్నర్ నరసింహన్ ను శుక్రవారం కలిసింది.  ఏపీ బీజేపీ బృందం లక్ష్మినారాయణ నేతృత్వం లో  చంద్రబాబు అవినీతి పై ఒక పుస్తకాన్ని అందచేశారు. ఈ పుస్తకం సారాంశం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై, ఇసుక దోపిడీ తదితర అవినీతి విషయాలపై కన్నా లక్ష్మీనారాయణ  వారానికి ఐదు ప్రశ్నలు చప్పున 100 ప్రశ్నలు సంధించారు.  ఇప్పటి వరకు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కార్యాలయం నుండి కానీ, సంబంధిత మంత్రుల నుండి కానీ, అధికారుల నుండి కానీ ఎలాంటి సమాధానం రాలేదని అన్నారు. ఈ వంద ప్రశ్నలను ఒక పుస్తకరూపం లో అచ్చు వేయించి గవర్నర్  కు ఇచ్చారు.  దీనిపై సత్వరమే స్పందించాలని గవర్నర్ ని కోరారు. గవర్నర్ ని కలసిన బృందంలో కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి,  మాజీ కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు , ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రటరీ ఐవైఆర్  కృష్ణారావు,  మాజీ డీజీపీ దినేష్ రెడ్డి,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు  మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, సురేష్ రెడ్డి,  వామరాజు సత్యమూర్తి,  ఢిల్లీ ప్రతినిధి సి.ఎస్.రావు,  అధికార ప్రతినిది సుదీష్ రాంబోట్ల, రాష్ట్ర కోశాధికారి పాకాలపాటి సన్యాసిరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags:AP BJP team who met the governor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *