29న ఏపీ కేబినెట్ సమావేశం

విజయవాడ ముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈనెల 29న అమరావతిలోని సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరగనుంది. ఈనెల 29న ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభం అవుతుందని సీఎస్ సమీర్ శర్మ వెల్లడించారు. అయితే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిన అంశాలపై ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా ప్రతిపాదనలు పంపించాలని వివిధ ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు . ఈ కేబినెట్ భేటీలో సెప్టెంబర్‌లో నిర్వహించాల్సిన అసెంబ్లీ సమావేశాలపై మంత్రులు చర్చించే అవకాశముందిమరోవైపు వచ్చే ఎన్నికలకు సీఎం జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు, సచివాలయాలకు నిధుల మంజూరుపై వచ్చే కేబినెట్ సమావేశంలో అధికారికంగా ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. జూన్‌ 24న చివరిసారిగా జరిగిన భేటీలో మంత్రివర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించారు. ఈనెల 29న జరగనున్న భేటీలో కూడా ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనన్నట్లు తెలుస్తోంది.ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా మంగళవారం నాడు సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి సీఎం వైఎస్‌ జగన్‌ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు.

 

Tags: AP Cabinet meeting on 29

Leave A Reply

Your email address will not be published.