కేరళ సీఎం తో మాట్లాడిన ఏపీ సీఎం

AP CM who spoke with Kerala CM

AP CM who spoke with Kerala CM

Date:18/08/2018
అమరావతి ముచ్చట్లు:
కేరళలో వరద పరిస్థితి గురించి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. కేరళలో తాజా పరిస్థితులను ఆరా తీసారు. కేరళకు వీలైనంత సహాయం అందించడానికి ఆంధ్ర ప్రదేశ్  ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేరళ సీఎం విజయన్ కు హామీ ఇచ్చారు.
వరద సహాయానికి తగిన విధంగా నిధులు సమీకరించడంలో సహాయపడతానని భరోసానిచ్చారు. వరద విపత్తు నుంచి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కేరళ రాష్ట్రంలో సంభవించిన ప్రకృతి వైపరిత్యాల వల్ల ప్రాణ, ఆస్థి నష్టం జరగడం పట్ల చంద్రబాబు విచారం వ్యక్తం చేసారు.
  ప్రజలకు సహాయక చర్యలను అందించేందుకు సహాయక బృందాలను సైతం పంపేందుకు సిద్ధంగా ఉన్నామని అయన అన్నారు. ఏపీ సర్కార్ ఇప్పటికే కేరళకు రూ.10 కోట్లు  సహాయం ప్రకటించింది.
మరోవైపు, ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కేరళ సహాయక చర్యలకు ప్రత్యేక బృందాలు పంపింది. 66 మంది అగ్నిమాపక సిబ్బంది, ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందం, ఒక జిల్లా ఫైర్ అధికారి, ఒక అసిస్టెంట్ ఫైర్ అధికారి, ఐదుగురు స్టేషన్ ఫైర్ అధికారులు, ఒక విపత్తుల నిర్వహణ శాఖ అధికారి,ఒక బోట్ మెకానిక్ , ఒక స్విమ్మింగ్ ఇన్ స్ట్రక్టర్ , 12 మోటర్  బోట్లు,  ఇతర రక్షణా పరికరాలతో కూడిన బృందం బయలుదేరింది.
Tags; AP CM who spoke with Kerala CM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *