ఏపి దిశ 2019 చట్టం మహిళా లోకానికి జగన్‌ ఇచ్చిన ఓ ఆయుధం

– ఏపిఎం హరికృష్ణారెడ్డి

Date:12/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

మహిళ భద్రతకు దిక్చూచిలాంటి ఏపి దిశ 2019 చట్టం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం మహిళ లోకానికి ముఖ్యమంత్రి వై ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన వజ్రాయుధం లాంటిదని వైఎస్‌ఆర్‌ క్రాంతిపథం ఏపిఎం హరికృష్ణారెడ్డి పేర్కొన్నారు. స్థానిక శక్తి భవన్‌లో వైఎస్సార్‌ క్రాంతి పథంలో నిర్వహించిన కార్యక్రమంలో జయహ్గజగనన్న…జయహ్గ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటు నినాదాలు చేశారు. అలాగే వారి చిత్రపటాలకు వైఎస్సార్‌ క్రాంతి పథం సిబ్బంది పాలాభిషేకాలు చేశారు. అనంతరం ఏపిఎం మాట్లాడుతూ మహిళలకు పూర్తి స్వాతంత్య్రం రాలేదని తెలిపారు. ఏపి దిశ 2019 చట్టం ద్వారా మహిళలపై , బాలికలపై ఎలాంటి అఘాయిత్యాలు , లైంగిక వేదింపులు జరగకుండ ఉండేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు శాశ్వతంగా భద్రత కల్పించారని పేర్కొన్నారు. డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో ఈచట్టంపై పూర్తి అవగాహన కల్పించేందుకు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, మాజీ ఎంపీపీ నరసింహులు, వైఎస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ నాగభూషణం, సీసీలు నాగరాజ, గంగోజి, మునిరత్నం, కృష్ణప్ప, సంఘమిత్రలు చిన్నప్ప, శీనప్ప, వసంతమ్మ, నాగమణి, పద్మ, సుబ్బన్న, శీనప్ప, ఏపివో శ్రీనివాసులు పాల్గొన్నారు.

తిరుమలలోని అతిథి గృహాలను ప‌రిశీలించిన అద‌న‌పు ఈవో

Tags: AP Direction 2019 is a weapon that Jagan gave to the world of women

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *