గ్రామీణ ప్రాంత విలేఖరులకు వెంటనే బస్ పాసులు పునరుద్ధరించాలని కోరిన ఏపీ ఈ ఆర్ యు, ఏ పీ జే యు.

Date:17/10/2020

ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:

https://www.telugumuchatlu.com/awareness-program-on-heart-attack/
 

గ్రామీణ ప్రాంత విలేఖరులకు వెంటనే బస్ పాసులు పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్, మరియు ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ సమాచార శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రాలను అందజేశారు. శుక్రవారం సాయంత్రం కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు మరియు ప్రధాన కార్యదర్శి వెంకట వేణు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఏ రాధాకృష్ణ, మరియు కార్యదర్శి హుమాయున్ లు కమిషనర్ను కలిసి వినతిపత్రాలు అందజేశారు. సెప్టెంబర్ 30వ తారీకు తో అక్రిడేషన్ ల గడువు ముగిసిన కారణంగా రాష్ట్రంలో విలేకర్ల బస్సు పాస్ లు రద్దయ్యాయి అని ,దీనివలన గ్రామీణ ప్రాంత విలేకరులు బస్సు ఎక్కితే టిక్కెట్టు తీసుకొనవలసి వస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సమయం నుంచి నేటి వరకు జీతాలు లేక మరియు లైన్ ఎకౌంట్లు రాక ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న సమయంలో ఈ బస్సు టిక్కెట్లు మరింత భారంగా మారాయని కమిషనర్ గారికి వివరించడం జరిగింది దీనిపై వెంటనే స్పందించి అక్రిడేషన్ లను మరికొద్ది రోజులు పొడిగించి బస్ పాసులను పునరుద్ధరించాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరిస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు.

గుండె పోటుపై అవగాహనా కార్యక్రమం

Tags: AP E RU, APJU demanded immediate restoration of bus passes for rural reporters.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *