మధ్యతరగతివారికి ఏపీ ప్రభుత్వం బంఫర్ ఆపర్

-తక్కవ ధరకే మీరు కోరుకున్న ప్లాట్
-సొమ్మును వాయిదా పద్దతుల్లో చెల్లించే అవకాశం
-ఇది కేవలం రూ.18 లక్షల ఆదాయం లోపు వారికి మాత్రమే
 
అమరావతి  ముచ్చట్లు:
 
ఏపీ ప్రభుత్వం మధ్యతరగతివారికి బంఫర్ ఆపర్ ఇచ్చింది. తక్కవ ధరకే మీరు కోరుకున్న ప్లాట్ ను విక్రయించనుంది. అంతేకాకుండా ప్లాట్ ధర సొమ్మును వాయిదా పద్దతుల్లో చెల్లించే అవకాశం ఇచ్చింది. అయితే ఇది కేవలం రూ.18 లక్షల ఆదాయం లోపు వారికి మాత్రమే. ఇందుకు సంబంధించిన దరకాస్తులు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. వెబ్ సైట్ ను ప్రారంభించిన సీఎం జగన్ వాటి వివరాలను వెల్లడించారు.ప్రభుత్వం చేపట్టని ‘జగనన్న స్మార్ట్ టౌన్ షిప్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సీఎం టౌన్ షిప్ లే అవుట్లకు సంబంధించిన వెబ్ సైట్ ను ప్రారంభించారు. 150 200 240 చదరపు గజాల ప్లాట్లను మధ్యతరగతి వారికి పంపిణీ చేసేందుకు ప్రణాళిక రచించామన్నారు. తక్కువ ధరకే అన్ని వసతులో కూడిన ఇళ్లను మధ్యతరగతి వారికి అందజేయనున్నట్లు తెలిపారు. ప్రతీ పేదవాడికి ఇల్లు ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని సీఎం జగన్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో 30 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని వాటి నిర్మాణాలు ప్రారంభమయ్యాయన్నారు. మధ్యతరగతి వారి సొంతింటి కలను కూడా నెరవేరుస్తామని సీఎం చెప్పారు.మిడిల్ క్లాస్ టౌన్ షిప్లో భాగంగా తొలిదశలో గుంటజూరు జిల్లా మంగళగిరి సమీపంలోని నవలూరు అనంతపురం జిల్లా ధర్మవరం వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి నెల్లూరు జిల్లా కావలి ప్రకాశం జిల్లా కందుకూరు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులల్లో సిద్ధం చేస్తున్నామన్నారు. ఇందులోని గృహాలను రూ.18 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారికే కేటాయిస్తామన్నారు. అర్హులంతా కొత్తగా ప్రారంభించిన వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవాని సూచించారు.మిగతా జిల్లాల్లోనూ దశల వారీగా టౌన్ షిప్ లు నిర్మిస్తామన్నారు. ఇక ప్రభుత్వం ఉద్యోగులకు 10 శాతం ప్లాట్లు ధరల్లో 20 శాతం తగ్గింపు ఉంటాయన్నారు. ఈ టౌన్ షిప్లో అన్ని వసతులతో నిర్మిస్తామన్నారు. స్పష్టమైన టైటిల్ తో పాటు లేఅవుట్లు పూర్తి పర్యావరణ హితంగా ఉంటాయన్నారు. ప్రతీ లే అవుట్లో 50 శాతం మౌలిక సదుపాయాలకు కేటాయిస్తామన్నారు. 60 అడుగుల బీటీ రోడ్లు 40 అడుగుల సీసీ రోడ్లు కలర్ టైల్స్ తో పాటు ఫుట్ పాత్ లు ెవెన్యూ ప్లాంటేషన్ తాగునీటి సరఫరా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తదితర సదుపాయాలు ఉంటాయన్నారు.కొత్తగా రూపొందించిన వెబ్ సైట్లో నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సీఎం తెలిపారు. అత్యంత పారదర్శకంగా ప్లాట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. ప్లాట్ల ధరను నాలుగు వాయిదాల్లో చెల్లంచే అవకాశం ఉందని తెలిపారు. మొదటి విడతలో 3894 ప్లాట్లను సిద్ధం చేశామని తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువగా ప్లాట్ల ధరలు ఉంటాయన్నారు. న్యాయమైన సమస్యలు లేని టైటిల్ తో ప్రభుత్వమే అన్ని రకాలు సదుపాయాలతో అందిస్తున్నందున అర్హులంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: AP government bumper upper for middle class