నైట్‌ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు

–   సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు
 
అమరావతి  ముచ్చట్లు:
 
సంక్రాంతి పండుగ నేపథ్యంలో నైట్‌ కర్ఫ్యూ అమలులో ఏపీ ప్రభుత్వం మార్పు చేసింది. సంక్రాంతి తర్వాత నైట్‌ కర్ఫ్యూ అమలు కానుంది. ఈ నెల 18 నుంచి రాత్రి కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  కర్ఫ్యూపై ఇచ్చిన ఉత్తర్వుల్లో ప్రభుత్వం సవరణ చేసింది. పండగ సమయంలో పట్టణాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున పల్లెలకు తరలివస్తుండటంతో వారికి ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశ్యంతో కర్ఫ్యూ అమలును వాయిదా వేసినట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: AP government change in night curfew enforcement

Natyam ad