ఏపీ హైకోర్టు తరలింపు వాయిదా వేయాలి

AP High Court move should be postponed

AP High Court move should be postponed

ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రిట్‌ పిటిషన్‌
Date:31/12/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి పరిధిలో నిర్మిస్తున్న భవనం పూర్తయ్యే వరకు హైదరాబాద్‌ నుంచి హైకోర్టు తరలింపు నిర్ణయం వాయిదా వేయాలని ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై సోమవారం అత్యవసర విచారణ చేపట్టాలని కోరింది. హైకోర్టు విభజనపై అత్యవసర విచారణ చేపట్టాలన్న అభ్యర్థనను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. జనవరి 2న సాధారణ విచారణ చేపడతామని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గగోయ్‌ ఈ పిటిషన్‌ను విచారణ స్వీకరించినప్పటికీ.. అత్యవసర విచారణను చేపట్టలేమని స్పష్టంచేశారు. సుప్రీం కోర్టుకు శీతకాల సమావేశాలు కొనసాగుతున్నందున జనవరి రెండున కోర్టు ప్రారంభమైన రోజు సాధారణ విచారణ చేపడతామని తెలిపారు.హైకోర్టు భవనాలు, జడ్జిల నివాస సముదాయాలు, ఇతర మౌలిక వసుతులు పూర్తయ్యే వరకు హైకోర్టు విభజన వాయిదా వేయాలని కూడా న్యాయవాదుల సంఘం కోరింది. మరోవైపు హైకోర్టు విభజన అవసరమేనంటూ తెలంగాణ ప్రభుత్వం కూడా సుప్రీం కోర్టులో కేవియట్‌ దాఖలు చేసింది.
Tags:AP High Court move should be postponed

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *