చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ఏపీ హైకోర్టు
అమరావతి ముచ్చట్లు:
చింతామణి నాటకం నిషేధంపై స్టే ఇచ్చేందుకు ఏపీ హైకోర్టు నిరాకరించింది. నాటకాన్ని నిషేధించడం పై హైకోర్టును ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆశ్రయించిన విషయం తెలిసిందే. రఘురామకృష్ణంరాజు తరపున ప్రముఖ న్యాయవాది ఉమేష్ వాదనలు వినిపించారు. చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాతంత్రాన్ని హరించడమే ధర్మాసనం ముందు ఉమేష్ వాదించారు. నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు జీవన ఉపాధి కోల్పోయారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చింది. నాటకాన్ని నిషేధించాల్సిన అవసరంలేదని అయన వాదించారు. నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా అభ్యర్థించారు. అయితే, ఉమేష్ అభ్యర్థనను తోసిపుచ్చిన హైకోర్టు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వటానికి అంగీకరించలేదు. నాటకానికి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్స్లేట్ వెర్షన్ సమర్పించాల్సిందిగా ఆదేశించింది. తదుపరి కేసు విచారణ ఆగస్టు 17 కు వాయిదా వేసింది.
Tags: AP High Court refuses to stay stay on Chintamani drama ban

