Natyam ad

పలు రాష్ట్రాలకు ఏపీ ఆదర్శం: సీఎం జగన్

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై సీఎం జగన్ సమీక్ష

 

తాడేపల్లి ముచ్చట్లు:

Post Midle

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్షా సమావేశానికి ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే లక్షా 65 వేల కోట్లు జమ చేశామని సీఎం జగన్‌ అన్నారు. ”పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. దేశంలో పలు రాష్ట్రాలకు మన పాలన ఆదర్శంగా ఉంది. అమ్మ ఒడి ఇచ్చిన రాష్ట్రం ఎక్కడా లేదు. ఆరోగ్యశ్రీలో 3 వేల చికిత్సలు ఇస్తున్న ప్రభుత్వం మనదే. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలి. లబ్ధిపొందుతున్న వారికి మరోసారి తెలియజెప్పాలని” సీఎం జగన్‌ సూచించారు.

 

Tags: AP is ideal for many states: CM Jagan

Post Midle