Natyam ad

”అభివృద్ధి” పాలనతో దేశంలోనే ఏపీ ముందంజ

ఏపీకి రూ.40వేల కోట్ల పెట్టుబడులు

పేదలకు సంక్షేమం, యువతకు ఉపాధే లక్ష్యంగా పరిపాలన

చంద్రబాబూ వెన్నుపోటు రాజకీయాలు మానవా

Post Midle

విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, పార్టీ జిల్లా అధ్యక్షులు భరత్

 

చిత్తూరు ముచ్చట్లు :


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, పెట్టుబడుల అంశాల్లో ముందంజలో ఉందని, సీఎం జగన్ రాష్ట్ర సుస్థిరాభివృద్ధి కోసం అమలు చేస్తున్న నాడు నేడు పథకం దేశానికే తలమానికమని డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. జీఎస్డీపీ మొదలు పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్య, ఉపాధి శిక్షణ అంశాల్లో ఏపీ ఇతర రాష్ట్రాల కంటే ముందంజలో ఉందన్నారు. అందుకు నిదర్శనమే గత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ నమోదు కంటే రాష్ట్ర జీఎస్డీపీ 11.43శాతంతో అధికంగా ఉందని వివరించారు.చిత్తూరు జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మంగళవారం నాడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో నారాయణస్వామి మాట్లాడారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం జగన్ పని చేస్తున్నారని అన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు రాష్ట్రంలో ఎంతో మందికి ఇళ్లు ఇచ్చామని, అనేక పథకాల ద్వారా ఎంతో మంది పేద వారిని ప్రభుత్వం ఆదుకుందని తెలిపారు. గతంలో చంద్రబాబు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను పట్టించుకున్న పాపాన పోలేదని.. ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత వారికే పెద్ద పీట వేస్తున్నారన్నారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితాలోనూ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. తెదేపా హయాంలో ఎక్కువ శాతం కమ్మ కులస్తులకే ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యారంగంలో విప్లవం వచ్చిందని.. ప్రతి పేద విద్యార్థి గొప్ప విద్యను పొందుతున్నారన్నారు.

 

 

 

 

చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచాడు.. ఆ తర్వాత మేనిఫెస్టో పేరుతో ప్రజలను వెన్నుపోటు పొడిచాడని నారాయణ స్వామి విమర్శించారు. లోకేశ్ ఒక్కసారి కూడా ఎమ్మెల్యే, ఎంపీగా గెలిచింది లేదని.. వాయిస్ లేని లోకేశ్ యువగళం పేరుతో పాదయత్ర చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తాము వేసిన రోడ్లపై లోకేశ్ పాదయాత్ర చేస్తూ.. శిలా ఫలకాల్ని ధ్వంసం చేయడం ఏంటని మంత్రి మండిపడ్డారు. పెత్తందార్లకు, పేదవారికి నడుస్తున్న పోరులో సీఎం జగన్ దే విజయమన్నారు. తెదేపా నేత అచ్చెన్నాయుడు పోలీసులపై అసభ్యకరంగా మాట్లాడం ఏంటని.. ఇదేనా వారి సంస్కారం అని విమర్శించారు. తెదేపా హయాంలో ఏనాడు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదని నారాయణస్వామి విమర్శించారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రం ఎడారిగా ఉండేదని.. ఇప్పుడు సీఎం జగన్ వచ్చాక సస్యశ్యామలం అయిందన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబాన్ని సర్వ నాశనం చేస్తున్నారని విమర్శించారు.

పెట్టుబడుల కేంద్రంగా ఏపీ; ఎమ్మెల్సీ భరత్

సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన సాగుతోందని, పెట్టుబడుల సాధనలో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో నిలవడం సీఎం జగన్ సమర్థతకు నిదర్శనమని వైఎస్సార్ సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ అన్నారు. దేశవ్యాప్తంగా DPIIT డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ నివేదిక ప్రకారం, 2022 జూలై చివరి నాటికి దేశ వ్యాప్తంగా రూ.1,71,285 కోట్ల పెట్టుబడులు రాగా, ఏపీ ఇతర రాష్ట్రాలతో పోటీ పడి రూ.40,361 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించి అగ్రస్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ తెలిపారు. రాష్ట్రాభివృద్ధి పెట్టుబడులపై ఎల్లో మీడియాతో కలిసి తెదేపా కుట్ర రాజకీయాలు చేస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో కమిషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాశనం చేసిన చంద్రబాబు కొత్త అబద్దాలతో ఏకంగా తన పార్టీ కార్యకర్తలను, నాయకులను కూడా మోసం చేసేందుకు సిద్ధమయ్యారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు.

సెల్ ఫోన్ నేనే కనుగొన్నా, చంద్ర మండలం మీదికి వెళ్లొచ్చా అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి, జిల్లాకు చేసిందేమి లేదని ఎమ్మెల్సీ మండి పడ్డారు. కుప్పం ప్రజలు ఆయన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకొంటే ఇప్పటి వరకు నియోజకవర్గంలో వెలగబెట్టింది ఏం లేదన్నారు. ఇటీవల ఆయన కుమారుడు లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్రకు వచ్చినపుడు.. తమ హయాంలో కుప్పంలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రగల్బాలు పలికి వెళ్లాడని.. అవి ఎప్పుడు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో కాస్త వివరణ ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్సీ లోకేశ్ కు హితవు పలికారు. తెదేపా నేతలు వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను తిట్టడం ద్వారా హైప్ తెచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. తెదేపా హయాంలో కేవలం కమ్మ కులస్తులకే ప్రాధాన్యం ఉండేదని.. కానీ, ప్రస్తుతం సీఎం జగన్ ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకే ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్సీ జాబితాలో కూడా సీఎం జగన్ వారికే పెద్ద పీట వేశారన్నారు. గతంలో చంద్రబాబు కుప్పంలో అత్యధికంగా ఉన్న వన్య కుల క్షత్రియులకు చేసిందేం లేదని.. ప్రస్తుతం సీఎం జగన్ వారికి ఎమ్మెల్సీ పదవుల్లో ప్రాధాన్యత కల్పించారన్నారు. కరోనా సమయంలో కుప్పం ప్రజలు చావు బతుకుల మధ్య ఉంటే చంద్రబాబు ఒక్క రోజు కూడా నియోజకవర్గంలో కనిపించలేదు.. ప్రజలను పట్టించుకోలేదన్నారు. ఆ సమయంలో ఎటు పోయారని ఎమ్మెల్సీ మండిపడ్డారు.

 

 

 

రాష్ట్రంలో పెట్టుబడులపై ఎమ్మెల్సీ వెల్లడించిన వివరాలివీ..

మన రాష్ట్రం 11.43శాతం GSDPతో 2021-22లో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా ఏపీ వుంది.

జాతీయ GDP 8.7 నమోదు అవ్వగా… రాష్ట్ర GSDP కేంద్ర జిడిపి కన్నా 2.73 శాతం ఎక్కువ.

కొవిడ్ 19 సమయంలో భారత దేశ వృద్ది రేటు -6.60 శాతం నమోదైన సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 0.08 శాతం వృద్దిరేటును నమోదు చేసింది.

రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కన్నా 38.5 శాతం ఎక్కువ.

దేశంలోనే మన రాష్ట్ర తలసరి ఆదాయంలో 6వ స్ధానంలో వుంది.

చంద్రబాబు పాలనలో 2018-19లో 5.36 శాతం వృద్దిరేటు వుండగా.. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో 2021-22 నాటికి 11.43 శాతం వృద్దిరేటు నమోదైంది.

జూన్ 2022లో టైర్ల రంగంలో ప్రపంచంలోననే మొదటి ఐదు కంపెనీలలో ఒకటైన ATC అలయన్స్ టైర్స్ రూ.1,240 కోట్లతో విశాఖపట్నంలో ప్లాంట్ కోసం పెట్టుబడి పెట్టింది.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి వరుసగా 4సంవత్సరాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

BDP బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ల కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో సహా అన్ని దక్షిణ భారత రాష్ట్రాలలో AP అగ్రగామిగా నిలిచింది.

ఆగస్టు 2022లో తూర్పు గోదావరిలో బల్క్ డ్రగ్ పార్క్ గ్రాంట్‌ను స్థాపించడానికి కేంద్రం నుండి ₹1,000 కోట్ల గ్రాంట్‌ను పొందింది.

YSR కడపలోని కొప్పర్తిలో YSR జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, YSR ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC)ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3,155 ఎకరాల విస్తీర్ణంలో హబ్‌ను అభివృద్ధి చేసి డిసెంబర్ 23, 2021న ప్రారంభించింది.

 

సొంత జిల్లాకు చంద్రబాబు చేసిందేమీ లేదు; ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు

14 ఏళ్లు సీఎంగా ఉండి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుకు ఏం చేశారని చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు ప్రశ్నించారు. చంద్రబాబు ఎన్టీఆర్ కే కాదు, గతంలో తనకు రెండు సార్లు వెన్నుపోటు పొడిచారని, ఇప్పుడు అబద్దాలు అసత్య ప్రచారాలతో అధికారం కోసం రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెదేపా కార్యకర్తలు ద్వితీయ శ్రేణి నేతలు కూడా చంద్రబాబు వెన్నుపోటుకు బలయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కులం వాళ్లకు పదవులు ఇవ్వాలనే కాంక్షతో చంద్రబాబు బీసీలకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. కానీ, సీఎం జగన్ రాజకీయ ఆర్థిక సమానత్వం కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ అన్ని పదవుల్లో బీసీలకు పెద్దపీట వేశారని వివరించారు. రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటి నుంచి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినట్లు చిత్తూరు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు తెలిపారు. నాడు నేడు తో విద్యార్థుల బంగారు భవితకు బాటలు పడుతున్నాయని అన్నారు. ఇప్పుడు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రతి పాఠశాలకు నిధులు కేటాయించి అభివ్రుద్ధి చేస్తున్నామన్నారు. చిత్తూరు జిల్లా అభివ్రుద్ధి కోసం సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని ఎమ్మెల్యే తెలిపారు.

లోకేశ్ ది ఓ గందరగోళ యాత్ర; పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ

రాజకీయాల్లో ఏం చేయాలో తెలియక దొడ్డి దారిన ఎమ్మెల్సీ, మంత్రి అయిన నారా లోకేశ్ యువగళం పేరుతో ఓ గందరగోళ పాదయాత్ర చేస్తున్నారని పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ విమర్శించారు. పాదయాత్రలో ఏం మాట్లాడాలో స్క్రిప్ట్ రాసి ఇచ్చిన మాట్లాడలేని లోకేశ్ ను రాష్ట్ర ప్రజలపై రుద్దేందుకు చంద్రబాబు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సీఎం జగన్ చేసిన పాదయాత్రలో సమస్యల పరిష్కారం కోసం ఇవి ఖచ్చితంగా చేస్తానంటూ ఇచ్చిన హామీలను మేనిఫెస్టో రూపంలో వంద శాతం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు తరహాలో అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను పక్కన పడేసి ప్రజలను మోసం చేయలేదని అన్నారు. ప్రతి ఇంటికి నవరత్నాల కింద ఎంత లబ్ది చేకూర్చామో తమ వద్ద జాబితా ఉందని తెదేపా హయాంలో నీరు, చెట్టు పేరుతో ఏం చేశారో జాబితా ఇవ్వాలని సవాలు విసిరారు. 175 కు 175 స్థానాల్లో విజయం సాధించడం చిత్తూరు జిల్లా నుంచే మొదలు పెడతామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.

 

Tags:AP is leading in the country with “development” rule

Post Midle