ఏపీ తెలంగాణ‌లో మాత్రం స‌గానికి స‌గం

Date:20/10/2020

న్యూఢిల్లీ ముచ్చట్లు:

వాన‌కీ క‌రోనాకి ఏదో స‌క్ర‌మ సంబంధం ఉన్న‌ట్లుంది. లేదంటే ప‌రుగులు పెట్టిన క‌రోనా కంట్రోల్ అయ్యింది చూశారా. ఇన్నాళ్లూ వ‌న్ బై వ‌న్ పెరిగిన నెంబ‌ర్లు కామ్ అయిపోయాయి. దేశ వ్యాప్తంగా పెద్ద‌గా తేడా రాలేదు. పేషెంట్లు పెరుగుతూనే ఉన్నారు. చ‌నిపోయేవారి సంఖ్యా త‌గ్గ‌డం లేదు. కానీ.. ఏపీ తెలంగాణ‌లో మాత్రం స‌గానికి స‌గం పైనే త‌గ్గిపోయాయి. మొన్న‌టి వ‌ర‌కూ ఏపీలో ప‌ది వేలు… ఎనిమిది వేల మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చేది. ర్యాపిడ్ టెస్టులు.. రెగ్యుల‌ర్ టెస్టులు చేస్తూ.. కరోనా వ‌చ్చిన ప్ర‌తి వారినీ ట్రీట్మెంట్ కి పంపారు డాక్ట‌ర్లు. ఇక తెలంగాణ‌లోనూ రెండు వేల దాకా వ‌చ్చేవి. కానీ.. ఈ వారంలో ఆ నంబ‌ర్ చాలా త‌గ్గింది. చ‌నిపోయే వారి సంఖ్య కూడా అలాగే తగ్గింది. ఇప్పుడు తెలంగాణ‌లో ఓ వెయ్యి మందికి అటూ ఇటూగా పేషెంట్లు అవుతున్నారు. వారిని ఇంటి ద‌గ్గ‌ర‌.. లేదంటే హాస్పిట‌ల్ కి తీస్కెళ్లి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఇక ఏపీలో కూడా..మూడు వేల మందికంటే త‌క్కువ మందికే క‌రోనా వ‌చ్చిందిప్పుడు. మొన్న‌టి వ‌ర‌కూ ప‌దివేల మంది దాకా క‌నిపించినా ఇప్పుడు మాత్రం భారీగా త‌గ్గింది. దీనికి రీజ‌న్ వానేనా అంటే.. నిజ‌మే అనిపిస్తోంది.

 

వానొచ్చింది క‌దా.. దేవుడు అందులో శానిటైజ‌ర్ క‌లిపి పోస్తున్నాడు అనుకుంటే పొర‌పాటే. అక్క‌డ అమ్రుత‌మే త‌ప్ప ఆల్క‌హాల్ దొర‌క‌దు. ఇక ఆల్క‌హాల్ లేకుండా శానిటైజ‌ర్ త‌యారు చేయ‌డం దేవుడికి మాత్రం ఎలా వీల‌వుతుంది. కాకపోతే చిన్న లాజిక్. ఎండ‌లో కూడా.. క‌ళ్ల‌ద్దాలు పెట్టుకునో..క్యాప్ లు పెట్టుకునో తిరుగుతుంటారు జ‌నాలు. కానీ వాన‌లో అంత సీన్ లేదు. అస‌లే క‌రోనా టైం ద‌గ్గు తుమ్ములు వ‌స్తే వ‌ణికిపోవాలి అని త‌డ‌వ‌కుండా ఉంటున్నారు. అందుకే పెద్ద‌గా బ‌య‌టికి రావ‌డం లేదు. రీసెంట్ గా వాన‌లు దంచికొడుతున్నాయి క‌దా. హైదరాబాద్ తో పాటు సిటీల్లో రోడ్లు అస్త‌వ్య‌స్తంగా ఉన్న‌య్. ఎందుకొచ్చిన గోల‌లే అని ఎవ‌రూ బ‌య‌టికి రావ‌డం లేదు. ఇక ప‌ల్లెటూళ్ల‌లో కూడా కూలీ ప‌నులు త‌గ్గిపోయాయి. టౌన్స్ లో కూడా వాన ఎఫెక్ట్ బానే ఉంది. సో.. ఇదేమైనా వ‌ర్క్ అవుట్ అయ్యి ఉండే ఛాన్స్ కూడా క‌నిపిస్తోంది.

శ్రీ బోయకొండ గంగమ్మ దేవస్థానం లో నాలుగవ రోజు పార్వతీదేవి అలంకారం

Tags: AP is only for Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *