Natyam ad

ఏపీ ఐసెట్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల

విశాఖపట్నం ముచ్చట్లు:


రాష్ట్రవ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఐసెట్ 2022 పరీక్ష ఫలితాలు విడుదల య్యాయి. ఈ ఫలితాలను విశాఖ ఏయూ వీసీ ప్రసాద్రెడ్డి విడుదల చేశారు.ఈ పరీక్షలో 87.83శాతం అర్హత సాధించారు.జులై 25న రాష్ట్ర వ్యాప్తంగా 24నగరాలతో పాటు హైదరాబాద్లో మొత్తం 107 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా పరీక్షకు 49,157 మంది దరఖాస్తు చేస్తున్నారు. వారిలో 42,496 మంది పరీక్షకు హాజరు కాగా.. 37,326 మంది అర్హత సాధించారని వీసీ తెలిపారు.

 

బాలుర ఉత్తీర్ణత శాతం 87.98 కాగా.. బాలికల ఉత్తీర్ణత శాతం 87.68శాతం ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. తొలి 10ర్యాంకుల్లో బాలురు 7 ర్యాంకులు సాధించగా, బాలికలు 3 ర్యాంకుల్లో మెరిశారు. తిరుపతికి చెందిన రెడ్డప్ప గారి కేతన్ రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించాడు.గుంటూరుకు చెందిన డి.పూజిత వర్ధన్ రెండో ర్యాంకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎన్.వంశీభరద్వాజ్ మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు.

 

Post Midle

Tags: AP ISET 2022 exam results released

Post Midle