శ్రీవారి సేవలో ఏపి మంత్రి గుమ్మనూరు జయరాం
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం దర్శించుకున్నారు.. మంగళవారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కలు చెల్లించుకున్నారు.. దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వీరికి వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.. ఆలయ బయటకు వచ్చిన మంత్రి గుమ్మనూరు జయరాం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించడం జరిగిందన్నారు.. చంద్రబాబు నాయుడుకి నోటీసులనేది కొత్త కాదని, నోటీసులు వచ్చినప్పుడల్లా వెంటనే స్టే తెచ్చుకునే విధంగా చంద్రబాబు ఆలోచన విధానం ఉంటుందని, అయితే తొందర్లోనే శిక్ష అనుభవించే పరిస్థితి చంద్రబాబుకు వస్తుందని గుమ్మనూరు జయరాం అన్నారు..
Tags; AP Minister Gummanur Jayaram in Srivari Seva

