20న ఏపి ఎన్‌జీవోల ఎన్నికలు

Date:18/10/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గ ఏపి ఎన్‌జీవో సంఘ ఎన్నికలు ఈనెల 20న నిర్వహిస్తున్నట్లు ఏపిఎన్‌జీవోల ఎన్నికల అధికారి నరసింహారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన స్థానిక ఎంసీవి కళాశాలలో ఎన్‌జీవో ప్రతినిధులతో చర్చించారు. మూడు నెలల క్రితం నిర్వహించాల్సిన ఎన్నికలు వాయిదా పడిందని వీటిని సత్వరమే నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. చిత్తూరు జిల్లా ఎన్‌జీవో సంఘ అధ్యక్షుడు రాఘవులు , కార్యదర్శి రఘు కలసి ఎన్నికలు నిర్వహించాలని ఆయన సూచించారు. పుంగనూరు , రామసముద్రం, పెద్దపంజాణి, చౌడేపల్లె, సదుం , సోమల మండలాకు చెందిన ఎన్‌జీవో నాయకులు ఎన్నికల్లో పాల్గొనాలన్నారు. ఈనెల 20న ఉదయం 11 గంటలకు ఎన్నికలను ఎంసీవి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎన్‌జీవోలు అందరు ఎన్నికల్లో పాల్గొని, ప్రశాంతంగా నిర్వహించాలని కోరారు.

22 నుంచి బహుజన చైతన్య ఉత్సవాలు

Tags: AP NGOs polls on 20th

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *