మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ లో ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2020పై ఏపీ అభ్యంతరాలు

పోర్టులపై పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండాలి
కేంద్రం చేపట్టే  మంచి పనులకు, నిర్ణయాలకు అంశాల వారిగా మద్దతిస్తాం
నెల రోజుల్లో ఈ బిల్లును పూర్తిగా స్టడీ చేసి నివేదిక ఇస్తామని గడువు కోరాం
మంత్రి గౌతం రెడ్డి

 

అమరావతి ముచ్చట్లు:

 

రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగితే మాత్రం మా ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించదు. బిల్లును ఉన్నది ఉన్నట్లు స్వాగతిస్తే ఇక రాష్ట్ర పోర్టుల అభివృద్ధి మొత్తం పూర్తిగా కేంద్రం చేతిలోకి వెళుతుంది. కేంద్ర మంత్రి మన్ సుఖ్ మాండవీయ కూడా అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. మంత్రి మాట్లాడుతూ కొన్ని మార్పులు, సవరణలకు కేంద్రం ఒప్పుకుంటేనే ఇండియన్ పోర్ట్స్ బిల్లు–2020 స్వాగతించగలం. ఇప్పటికే ఏపీ ప్రతిపాదించిన పలు సవరణలకు అంగీకరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ న్యాయ విభాగం ముసాయిదా బిల్లును సమీక్షిస్తోంది. పూర్తి స్పష్టతకు మరింత సమయం కావాలి. బిల్లులో గుర్తించిన కొన్ని కీలక విషయాలను మీ దృష్టికి తీసుకువస్తున్నాం. భారతదేశంలో మొత్తం 160 మైనర్ పోర్టులకు సంబంధించి మారిటైమ్ పోర్టు రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్ ను బిల్లు అందిస్తోంది. 13 మేజర్  పోర్టులకు రెగ్యులేటరీ అథారిటీ యాక్ట్, 2020 ప్రకారం 13 రెగ్యులేటరీ  అథారిటీలు ఉన్నాయి. ఇది మైనర్, మేజర్ పోర్టుల మధ్య వివక్ష పెంచేలా ఉంది. మేజర్ పోర్టుల మాదిరిగానే ప్రతి రాష్ట్రానికి మారిటైమ్ పోర్టు రెగ్యులేటరీ అథారిటీ అధికారాలను ఆయా రాష్ట్రాల మారిటైమ్ బోర్డులకు అప్పగించాలి. ఓడరేవు నియంత్రణ అధికారాలు   కేంద్రం నియమించిన రాష్ట్ర మారిటైమ్ బోర్డులు, రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రప్రభుత్వం ఇవ్వాలి. “రిచ్ హెరిటేజ్” పేరుతో దేశ ఖ్యాతి ఉట్టిపడేలా మ్యూజియమ్, గ్యాలరీల ఏర్పాటు ఆలోచన బాగుంది. మైనర్ పోర్టుల నియంత్రణ బాధ్యతలు కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోకూడదు. అందుకు బదులు రాష్ట్ర ప్రభుత్వాలకే ఓడరేవుల నియంత్రణ అధికారమివ్వాలి. ఏ రాష్ట్ర ఎకనమీని ముందుకు తీసుకువెళ్లాలన్నా.

 

 

 

 

ఆయా రాష్ట్రాల పరిధిలోని ఓడరేవులు పాత్ర కీలకం. ఎందుకంటే, మైనర్ పోర్టుల ఏర్పాటులో కీలకమైన మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు అందించేంది రాష్ట్రాలు మాత్రమే. కాబట్టి, ఒకవేళ రాష్ట్ర పరిధిలోని పోర్టులను కేంద్రమే నియంత్రిస్తే ఆయా రాష్ట్రాలు ఆర్థికంగా ముందుకు నడిపించే హక్కు, అవకాశం కోల్పోతాయి. పైన చెప్పిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభిప్రాయాల్లో పూర్తి వాస్తవాలు ఉన్నప్పటికీ , వాటాదారుల (స్టేక్ హోల్డర్లు) అభిప్రాయం పరిగణలోకి తీసుకోకుండా ముందుకు వెళ్లకూడదని సూచించారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పోర్టులు, ఏర్పాటైన మారిటైమ్ బోర్డు రాష్ట్రాలకు మినహాయింపుని కోరారు. ‘సాగరమాల’ సహా ఎన్ హెచ్ ఏ, ఎమ్ఓఆర్ టీ హెచ్ పథకాల కింద ఏపీలో రహదారులను నిర్మించేందుకు కేంద్రం అందిస్తోన్న సహాయ సహకారాలకు ధన్యవాదాలు. గంగవరం, క్రిష్ణపట్నం, కాకినాడలోని గేట్ వే పోర్టులలో రహదారుల విస్తరణ, అనుసంధానం, పూర్తికి తోడ్పడాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన  మొత్తం 32 ప్రాజెక్టులు సహా మరి కొన్ని కీలక ప్రాజెక్టులు డీపీఆర్, ప్రణాళిక దశలో ఉన్న తరుణంలో త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నాం. గత ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర కీలక ప్రాజెక్టులపై వినతిపత్రం అందించామని కేంద్ర నౌకాయాన మంత్రి మన్ సుఖ్ మాండవీయకి మంత్రి గుర్తు చేసారు. పోర్టులు, ప్రాజెక్టుల అభివృద్ధికి సంబంధించి “ప్రత్యేక నిధి”ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని అయన కోరారు.

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆత్మనిర్భర్  భారత్ దిశగా అడుగులు వేయడంలో ముందుంది. భారత ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించగల ఛాంపియన్ రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి.  విమానాశ్రయాలు,ఓడరేవులతో పాటు అనేక వనరులు కలిగిన రాష్ట్రం, అందువల్ల ఏపీకి ఎగుమతులను ప్రోత్సహించే భారీ సామర్థ్యం ఉంది.  మారిటైం స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ వర్చువల్ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ వాణిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వినిపించారు.
18వ ఎంఎస్డీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ తరపున మంత్రి మేకపాటితో పాటు పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్, మారిటైమ్ బోర్డు సీఈవో కె.మురళీధరన్, పరిశ్రమల శాఖ సలహాదారు లంకా శ్రీధర్, ఆంధ్రప్రదేశ్ సహా కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక ,గోవా, ఒరిస్సా , గుజరాత్, పుదుచ్చేరి రాష్ట్రాల నుంచి వర్చువల్ గా హాజరయ్యారు.

 

పుంగనూరులో కరోనా మందును వినియోగించుకోండి- కమిషనర్‌ కెఎల్‌.వర్మ

Tags: AP Objections to Indian Ports Bill-2020 in Maritime State Development Council

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *