కియా మోటార్స్ తో ఏపీ సర్కార్ ఒప్పందం

AP Sarkar Agreement with Kia Motors

AP Sarkar Agreement with Kia Motors

Date:06/12/2018
అమరావతి ముచ్చట్లు:
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కియా కారులో ప్రయాణించారు. సచివాలయంలో కియా మోటార్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న అనంతరం చంద్రబాబు ఎలక్ట్రికల్ కార్లను ప్రారంభించారు. అనంతరం కియా మోటార్స్ సంస్థ ఎండీతో కలిసి చంద్రబాబు కియా కారులో ప్రయాణించారు. సచివాలయం ఐదో బ్లాక్ నుంచి ఒకటో బ్లాక్ వరకు చంద్రబాబు కియా కారులో ప్రయాణించారు. కార్యక్రమంలో భాగంగా సచివాలయంలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ను కుడా అయన ప్రారంభించారు. అనంతపురంలో ఏర్పాటవుతున్న  కియా మోటార్స్ ప్లాంట్ ఏటా 3 లక్షల కార్ల తయారీ చేయనుంది. ఈ  ప్లాంట్ నిర్మాణానికి 1.6 బిలియన్ యుఎస్ డాలర్ల పెట్టుబడి అవసరవమవుతోంది. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 11 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కలుగుతున్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలోనే కార్లను రోడ్డుపైకి తెచ్చేలా కియా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.
Tags; AP Sarkar Agreement with Kia Motors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *