తిరుమల శ్రీవారిని దర్శించుకున్నఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఆదివారం ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్‌కు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఎవి. ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్ సాదరంగా అహ్వానించగా, అర్చక బృందం ”ఇస్తికఫాల్” ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఎస్.అబ్దుల్ నజీర్ వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా ఛైర్మన్, ఈవో తీర్థప్రసాదాలు, శ్రీవారి చిత్రపటాన్ని అందించారు.ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవోలు లోకనాథం. విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags:AP State Governor S. Abdul Nazir visited Tirumala Srivara
