క్రీడలతోపాటు విద్యలోనూ రాణించి ఆదర్శజీవితానికి పునాదులు వేయాలి

– గెలుపు ఓటములను టేకిటీజీగా తీసుకోవాలి
– క్రీడాకారులకు జగనన్న ప్రభుత్వంలో మరింత ప్రోత్సాహం
– 700 మంది క్రీడాకారులకు సొంతనిధులతో వింధు ఏర్పాటు
– కబడ్డీ పోటీలను తిలకించిన పెద్దిరెడ్డిద్వారకనాథరెడ్డి

 

చౌడేపల్లె ముచ్చట్లు:

క్రీడారంగంతోపాటు విద్యలోనూ క్రీడాకారులు రాణించి తమ ఆదర్శ జీవితానికి పునాదులు వేసుకోవాలని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచించారు. శనివారం చౌడేపల్లె ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న అండర్‌ 17 అంతర్‌జిల్లాల బాలబాలికల కబడ్డీ పోటీల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ స్యధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో క్రీడలకు ప్రత్యేక నిధులు మంజూరుచేసి క్రీడా ఔన్యత్యాన్ని, క్రీడా రంగాన్ని ప్రోత్సహించారన్నారు.గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ఆణిముత్యాలను వెలికితీసి వారిలో ఉన్న నైపుణ్యతను గుర్తించడానికి ఆడుధాం ఆంద్ర,తోపాటు జోనల్‌స్థాయిలో, మండల స్థాయిలో క్రీడలను నిర్వహించడం జరుగుతోందన్నారు. నాడు-నేడు ద్వారా పాఠశాలలతోపాటు క్రీడా మైదానాలను అభివృద్దిచేసుకోవడం జరిగిందన్నారు. అంతర్‌జిల్లాల కబడ్డీ పోటీలకు ఆంధ్ర రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాలనుంచి వచ్చిన బాలురు, బాలికల క్రీడాకారులకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో రాష్ట్ర స్థాయి క్రీడలనిర్వహణకు కృషిచేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిలు, నిర్వహణలో కృషిచేసిన పాఠశాల పూర్వపు విద్యార్థులకు అభినందలు తెలిపారు. ప్రతియేటా పుంగనూరులోనే రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలను మరింత ఉత్సాహంగా నిర్వహించేలా చర్యలు తీసుకొంటామన్నారు. గెలుపు ఓటమిలను క్రీడాకారులు టేకిటీజీగా తీసుకోవాలని సూచించారు. గెలుపొందిన వారికంటే ఓటమి పొందిన వారు నిరుత్సాహ పడకుండా మరింత రెట్టింపు ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని సందేశమిచ్చారు. ఎమ్మెల్యేనువైఎస్సార్‌సీపీ రాజంపేట, చిత్తూరు పార్లమెంట్‌ యూత్‌ అధ్యక్షుడు మిద్దింటి కిషోర్‌బాబు, కబడ్డీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర,. సర్పంచ్‌ వరుణ్‌భరత్‌, పూర్వపు విద్యార్థులు సత్కరించి మెమెంటోను అందజేశారు.

 

 

ఆసక్తిగా కబడ్డీ పోటీలను తిలకించిన ఎమ్మెల్యే…. చిత్తూరు- కడప జిల్లాల బాలికల కబడ్డీ పోటీలు ఉత్కంఠ భరితంగా సాగాయి. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి క్రీడ ప్రారంభంనుంచి ముగింపు వరకు తిలకించారు. కేరింతల నడుమ, రెట్టింపు ఉత్సాహంతో పోటీలు సాగాయి.

 

 

సొంతనిధులతో 700మంది క్రీడాకారులకు వింధు …..
క్రీడాపోటీలకు రాష్ట్రంలోని 13 జిల్లాలనుంచి వచ్చిన 700 మంది క్రీడాకారులకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సొంత నిధులతో ఆదివారం వింధు భోజనం ఏర్పాటుచేస్తున్నట్లు ప్రకటించారు. తన కోరిక మేరకు ఆధిత్యాన్ని స్వీకరించాలనిక్రీడాకారులను కోరారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామమూర్తి,వైస్‌ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, స్కూల్‌ గేమ్స్ మాజీ కార్యదర్శి మల్‌రెడ్డి, జిల్లా కబడ్డీ సంఘ అధ్యక్షుడు మధుబాబు, జాతీయ క్రీడాకారుడు చినబాబు, క్రీడల అబ్జర్వర్‌ రామ్‌బాబు, పూర్వపు విద్యార్థులు పిల్లారి జీవన్‌ ప్రకాష్‌, లీలాకుమార్‌, మహేష్‌బాబు, హనుమాన్‌సేట్‌, మంజునాథ్‌, తదితరులున్నారు.

Tags: Apart from sports, we should excel in education and lay the foundations for an ideal life

 

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *