Natyam ad

కాణిపాకంలో ఏపీసీసీ ఛీఫ్

చిత్తూరు ముచ్చట్లు:

రాహుల్ గాంధీ చేపట్టిన   భారత్ జోడో యాత్ర విజయవంతంగా పూర్తి చేయాలని మాజీ మంత్రి,పిసీసీ అధ్యక్షులు సాకే శైలజ నాథ్ ఆకాంక్షిం చారు.ఈ మేరకు శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో రాహు ల్ యాత్ర విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజులు పాటు నిర్వహించే భారత్  జోడో యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని ఆకాంక్షించారు.దేశంలో రాక్షస పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలంతా సుఖశాంతులతో ఉండాలని వరసిద్ధి వినాయకుని ప్రార్ధించినట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షులు సురేష్ మాట్లాడుతూ  కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జూడో యాత్ర ఇతర రాష్ట్రాల్లో మంచి స్పంద న వచ్చిందని ఆంధ్రప్రదేశ్లో కూడా మంచి స్పందన వస్తుందని తెలిపారు.

 

Tags: APCC chief in Kanipakam

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.