పుంగనూరులోఏపీనీడ్స్ జగన్‌ కార్యక్రమం

పుంగనూరుముచ్చట్లు:

మండలంలోని ఎంసీ.పల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయంలో డిజిటల్‌ బోర్డును ఆవిష్కరించి, గ్రామంలో పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి మా నమ్మకం నువ్వే జగన్‌ బుక్‌లెట్లను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలను వివరించి, అవగాహన కల్పించారు. అలాగే మున్సిపాలిటి పరిధిలోని చెంగాలపురంలో వైఏపీ నీడ్స్ జగన్‌ కార్యక్రమాన్ని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, కౌన్సిలర్లు మనోహర్‌, సుప్రియ, కాళిదాసు కలసి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, సచివాలయాల కన్వీనర్‌ రాజశేఖర్‌రెడ్డి, సర్పంచ్‌ వెంక టరెడ్డి, నాయకులు జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Apneades Jagan program in Punganur

Post Midle