శ్రీవారి సేవలో ఏపిఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు
తిరుమల ముచ్చట్లు:
తిరుమల శ్రీవారిని ఏపి ఎపిఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు దర్శించుకున్నారు.. మంగళవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో ఏపి ఎపిఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ రావు స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికలందరికి సకాలంలో జీతాలు పడాలనేది మా ఆకాంక్ష అని,రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్ధిక పరిస్థితి మెరుగు పడాలని స్వామి వారిని వేడుకున్నట్లు చెప్పారు.. ఎన్నో రోజులు ప్రభుత్వాన్ని అనేకమార్లు ఉద్యోగులకు రావాల్సిన నిధులపై, కాంట్రాక్టు ఉద్యోగులు పర్మినేంట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు తగిన వేతం, గ్రామ వాలంటీర్ లకు బదిలీని విరమించాలని, ప్రభుత్వంను కోరడం జరిగిందన్నారు..ఏపి సీఎం కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ఇచ్చిన ఎన్నికల హామీను వెంటనే అమలు చేయాలని కోరారు.. ఉద్యోగుల డిమాండ్లు నేరవేర్చలేక పోతే అవసరం అయితే ఉద్యమ కార్యచరణకు సిద్దంగా ఉన్నాంమని ఆయన హెచ్చరించారు.
Tags: APNGO president Bandi Srinivas Rao at Srivari Seva

