మహారాష్ట్ర ముచ్చట్లు:
మహారాష్ట్రలోని మాల్వాన్ లో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. “నేను శిరస్సు వంచి ఛత్రపతి శివాజీ మహారాజ్ ను క్షమాపణలు కోరుతున్నా” అని తెలిపారు. “ఛత్రపతి శివాజీ మహారాజ్ ను తమ ఆరాధ్యదైవంగా భావించి, ఈ ఘటనతో తీవ్రంగా బాధపడ్డ వారికి తల వంచి క్షమాపణలు చెబుతున్నాను. మన విలువలు వేరు. మనకు మన దైవం కంటే పెద్దది ఏమీ లేదు” అని ఆయన పేర్కొన్నారు.
Tags: Apologizing to Chhatrapati Shivaji Maharaj with bowed head: Prime Minister Narendra Modi