విద్యార్ధులకు యాప్ అటెండన్స్

ఏలూరు  ముచ్చట్లు:


అమ్మా.. బడికి వెళుతున్నానని ఇంటిలో చెప్పి స్నేహితులతో కలిసి షికార్లు కొడుతూ పాఠశాలకు డుమ్మా కొట్టడం ఇకపై కుదరదు.. ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్‌లైన్‌లో స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ ద్వారా హాజరు నమోదు చేయడంతో విద్యార్థులు ఉదయం 9.30 గంటలలోపు పాఠశాలకు రాకుంటే తల్లిదండ్రులకు మెసేజ్‌ వెళ్లేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే అవకాశం ఏర్పడింది.  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరుశాతం పెంచడానికి, మధ్యాహ్న భోజన పథకంలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ దోహదపడుతోంది. ప్రభుత్వ పాఠశాల ఉదయం 9 గంటలకు ప్రారంభమైతే ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఆయా క్లాసుల్లో ఉదయం 9.15 గంటల నుంచి 9.30 గంటల వరకు హాజరు వేస్తారు. పాఠశాల ఉపాధ్యాయుడు తన తరగతికి వెళ్లిన వెంటనే సెల్‌ఫోన్‌లో  స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ లాగిన్‌ అయ్యి విద్యార్థుల హాజరు నమోదు చేస్తారు. సాయంత్రం పూట గతంలో మాదిరి హాజరు పట్టీలో మ్యాన్యువల్‌గా నమోదు చేస్తారు. ఉదయం యాప్‌లో విద్యార్థి హాజరు నమోదు కాకుంటే వెంటనే తల్లిదండ్రుల సెల్‌ఫోన్‌కు మెసేజ్‌ వెళుతుంది.

 

 

దీంతో కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు బడికి రాకపోవడానికి గల కారణాలను పాఠశాలలకు వెళ్లి ఉపాధ్యాయులకు తెలియజేస్తున్నారు.  రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. అమ్మఒడి, జగనన్న గోరుముద్ద, విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అమలుచేయడంతో పాటు ఇంగ్లిష్‌ మీడియం చదువులను ప్రవేశపెట్టారు. మన బడి నాడు–నేడులో భాగంగా పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా తరగతి గదులు, ఫరి్నచర్, తాగునీరు, మరుగుదొడ్లు, ఆటస్థలాలు వంటి వసతులు కలి్పస్తున్నారు.  జిల్లాలోని 1,391 ప్రభుత్వ, 472 ప్రైవేట్‌ పాఠశాలల్లో స్టూడెంట్‌ అటెండెన్స్‌ యాప్‌ అమలుచేస్తున్నాం. దీంతో విద్యార్థులు తప్పని సరిగా క్లాసులకు హాజరవుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా సమాచారం వెళుతుండటంతో వారి పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం ఏర్పడింది.

 

Tags: App attendance for students

Leave A Reply

Your email address will not be published.