Natyam ad

రాజస్థాన్ లో  ఆప్ అడుగులు

జైపూర్ ముచ్చట్లు:


ఇప్పటికే జాతీయ రాజధాని ఢిల్లీలో అధికారంలో పాతుకుపోయిన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రీసెంట్‌గా పంజాబ్‌లోనూ పవర్‌లోకి వచ్చింది. లేటెస్టుగా మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీ మునిసిపల్‌ ఎన్నికల్లో మేయర్‌ పీఠాన్ని దక్కించుకోవటం ద్వారా ఆ రాష్ట్రంలో అకౌంట్‌ తెరిచింది. మధ్యప్రదేశ్‌లో ఇండోర్‌ తర్వాత పెద్ద మునిసిపల్‌ కార్పొరేషన్‌ సింగ్రౌలీ. కాబట్టి ఆప్‌ సొంతం చేసుకున్న ఈ విజయం విశేషమనే చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ పార్టీ మరో రాష్ట్రం పైన ఫోకస్‌ పెట్టింది. అదే.. రాజస్థాన్‌. అక్కడ కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు ఆడుతున్న ఖో-ఖో ఆట ఇక చెల్లదు పో అంటోంది.రాజస్థాన్‌లో ఈ రెండు పార్టీలు రాజకీయంగా లోపాయికారీ ఒప్పందాన్ని కుదుర్చుకొని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టాయని ఆప్‌ విమర్శిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని ఎన్నికలకు ముందు ప్రకటించలేని దురవస్థ కాంగ్రెస్‌, బీజేపీలదని ఆప్‌ రాజ్యసభ ఎంపీ సందీప్‌ పాఠక్‌ ఎద్దేవా చేశారు.

 

 

 

పంజాబ్‌లో ఆప్‌ అనూహ్య విజయం వెనక ఉన్న స్ట్రాటజిస్ట్‌ ఈయనే. రాజస్థాన్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎలక్షన్‌ జరగనుంది. అక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉంది. ఆ రాష్ట్రంలో రానున్న రోజుల్లో ఆప్‌ అనుసరించనున్న వ్యూహాన్ని సందీప్‌ పాఠక్‌ మీడియాతో పంచుకున్నారు.“స్థానికుణ్నే సీఎం చేస్తాం” అనే ప్రచారంతో ముందుకెళతామని చెప్పారు. బీజేపీ అంతర్గత కుమ్ములాటలతో అతలాకుతలం అవుతూ ప్రధాని మోడీ పేరు, ఫొటో చూపి ఓట్లు వేయించుకోవాలనుకుంటోందని తప్పుపట్టారు. జాతీయ నాయకుడి (మోడీ) గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారని, ఇవి లోక్‌సభ ఎన్నికలు కావు కదా అని ఆయన ప్రశ్నించారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజస్థాన్‌లోని మొత్తం 200 ఎమ్మెల్యే స్థానాల్లో పూర్తి సన్నద్ధతతో పాల్గొంటుందని ప్రకటించారు. ఎన్నికలకు ముందు సర్వే చేస్తామని, తద్వారా వాస్తవ పరిస్థితులపై ఒక అంచనాకు వస్తామని, జనం ఏం కోరుకుంటున్నారో తెలుస్తుందని సందీప్‌ పాఠక్‌ అన్నారు.ఏ అభ్యర్థికైతే విజయవకాశాలు ఎక్కువగా ఉంటాయో,

 

 

 

Post Midle

ప్రజల్లో ఎవరికైతే గుడ్‌ ఇమేజ్‌ ఉందో వాళ్లనే బరిలోకి దింపుతామని, ఆయా క్యాండేట్లను సర్వే ఫలితాల ఆధారంగా నిర్ణయిస్తామని తెలిపారు. పంజాబ్‌లోనూ ఇదే ప్రణాళికను అమలుచేసి సక్సెస్‌ అయ్యామని గుర్తుచేసుకున్నారు. నాయకులకే కాకుండా క్రియాశీలక కార్యకర్తలకు కూడా ఆప్‌ టికెట్లు కేటాయిస్తామని వెల్లడించారు. నిజం చెప్పాలంటే పంజాబ్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆప్‌ రాజస్థాన్‌లో ఎలక్షన్‌ ప్రిపరేషన్‌పై దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆప్‌ ప్రాతినిధ్యం సున్నా. జీరో నుంచి హీరో లెవల్‌కి ఎదగాలని లక్ష్యంగా పెట్టుకుంది.కాంగ్రెస్‌, బీజేపీ ఈ రెండు పార్టీల్లో ఏది అధికారంలో ఉన్నా రాజస్థాన్‌కి ఒరిగిందేమీలేదని ఆప్‌ అంటోంది. సామాన్యుల సమస్యలను అవి గాలికొదిలేశాయని మండిపడుతోంది. ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజస్థాన్‌లో ఇప్పటికే మిస్డ్‌ కాల్స్‌తో మెంబర్‌షిప్‌ డ్రైవ్‌ని చేపట్టింది. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ‘గ్రామ్‌ సంపర్క్‌ అభియాన్‌’కి శ్రీకారం చుట్టి స్థానికులతో సత్సంబంధాలను మెయిన్‌టెయిన్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే రాజస్థాన్‌లోనూ ఆప్‌ రాణిస్తుందా అనే ఆసక్తి నెలకొంది.

 

Tags: App steps in Rajasthan

Post Midle