Natyam ad

అంగ రంగ వైభవముగా అప్పన్న జమ్మి వేట

-శ్రీ రాముడు అలంకరణ లో సింహాద్రి నాధుడు

సింహాచలం ముచ్చట్లు:


సింహాచలం శ్రీ వరహాలక్ష్మీ నృసింహ  స్వామి ఆలయంలో విజయదశమి పర్వదిన సందర్భంగా  అప్పన్న జమ్మి వేట ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.. ప్రతి యేటా దసరా పర్వదినం  సందర్భంగా సాంప్రదాయపదంగా నిర్వహించే ఈ ఉత్సవాన్ని ఈ యేడాది   ఆలయ వర్గాలు కన్నుల పండుగగా జరిపించారు.. తొలుత సింహాద్రి నాధుడిని సర్వాభరణాలతో చూడముచ్చటగా శ్రీరాముడు అలంకరణ గావించారు.. అనంతరం ఆలయ బేడా మండపంలో తిరువీధి ప్రదక్షిణ నిర్వహించి స్వామివారిని ఆలయ ఆస్థాన మండపంలో ఆసీనులను చేశారు.. అనంతరం వేద పండితులు వేద మంత్రాలు వల్లిస్తుండగా , మృదు మధుర మంగళ వాయిద్యాల నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు..

 

 

Post Midle

విస్వక్షేన, పలు వేదాలు తో  స్వామి వారి నీ కీర్తించారు.. ఆ తరువాత మంగళ వాయిద్యాలు మధ్య జమ్మి చెట్టు వద్దకు చేరుకొని పుణ్యాహవచనం కార్యక్రమాన్ని జరిపించారు. ఆతరువాత ఆలయ రాజగోపురం ఎదురుగా ఉన్న నృసింహ మండపం లో  జమ్మి చెట్టుకు పూజలు జరిపి జమ్మి ఆకులను కోసి వాటిని తీసుకొని వచ్చి స్వామి పాదాల చెంత నుంచి ప్రత్యేక అర్చన గావించారు. ఆయా  పూజల్లో పాల్గొన్న భక్తులందరికీ ఆలయ వర్గాలు తీర్థప్రసాదాలు అందజేశాయి.. జమ్మి చెట్టు విజయానికి ప్రతీక గా పురాణ ఇతిహాస కథనాలు స్పష్టం చేస్తున్నాయి. విజయదశమి సందర్భంగా  భారత వికాస్ పరిషత్ వారిచే సాంస్కృతిక కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.ఆర్చక వర్గాలు,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరాజు, ఆలయ అధికారులు ఆనంద్ కుమార్ పిల్లా శ్రీను, అప్పన్న ధర్మ కర్తల మండలి సభ్యులు సభ్యులు గంట్ల శ్రీనుబాబు, వంకాయల సాయి నిర్మల ,శ్రీదేవి వర్మ సాయిలు ఉత్సవము లో పాల్గొని పూజలు నిర్వహించారు.

 

Tags: Appanna Jammi Veta is an Anga Ranga magnificence

Post Midle