టీటీడీ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞాపన

తిరుమల ముచ్చట్లు :

 

టీటీడీ లో కారుణ్యనియామకాలను వెంటనే ఇప్పించి,కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా “వర్చువల్”/మహతి నందు విడతల వారీగా అవగాహనా తరగతులు నిర్వహించుట గురించి అభ్యర్థన. తిరుమల తిరుపతి దేవస్థానంలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి అనారోగ్యంతోనూ,కరోనా కు గురై మొదటి/రెండవ వేవ్ లో 100మందికి పైగా ఉద్యోగులు మరణించడం జరిగింది.మరణించిన ఉద్యోగులకుటుంబ సభ్యులు ఆసుపత్రులకు లక్షలాది రూపాయలు వైద్యం కోసం వెచ్చించి అప్పులపాలై తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు.ఉద్యోగి జీతం పై ఆధారపడి జీవించే ఆ కుటుంబాలు ఆ ఉద్యోగి మరణంతో వారి జీవనంచాలాకష్టంగా మారింది.మరణిoచిన ఉద్యోగి కుటుంబసభ్యులు గత 2సంవత్సరాలుగా కారుణ్య నియామకాల కొరకు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు.కారుణ్యనియామకం ఇచ్చే ఉద్యోగులకు విధుల్లో ఎలా వ్యవహరించాలనే ప్రాథమిక అవగాహనా తరగతులను కరోనా దృష్ట్యా “వర్చువల్” విధానంలో గాని,కోవిడ్ నిబంధలను పాటిస్తూ షిప్ట్ పద్దతిలో “మహతి”ఆడిటోరియం నందు గాని అవగాహనా తరగతులు నిర్వహించేలా ఏర్పాట్లు చేసి ఆలస్యం కాకుండా కారుణ్యనియామకం చేపట్టాలి.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Appeal to the Joint Action Committee of the TTD Job Unions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *