జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు కొరకు దరఖాస్తులు ఆహ్వానం

Date:19/08/2018

పెద్దపంజాణి ముచ్చట్లు:

జిల్లా స్థాయిలో 2018 విద్యా సంవత్సరానికి ఉత్తమ ఉపాధ్యాయు అవార్డుల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారని ఎంఈవో హేమలత ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, జెడ్పీ, ఎంపీ, పురపాలక, ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో పనిచేస్తూ 15 సం.లు సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. కాగా గతంలో జరిగిన జిల్లా స్థాయి గురుపూజోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన అభ్యర్థులు అనర్హులని ప్రకటనలో పేర్కొన్నారు.

 

ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు సంబంధించిన దరఖాస్తు నమూనాలను డీఈఒ, డీవైఈఒ, ఎంఈఒ కార్యాలయాల్లో ఈ – మెయిల్ ద్వారా పొందవచ్చని తెలిపారు. దరఖాస్తు నమూనాలు 50 పేజీలకు మించకుండా పూర్తి చేసి, ఆగస్టు 30 వ తేదీ లోపు డీఈఒ, డీవైఈఒ,ఎంఈఒ కార్యాలయాల్లో అందజేయాలని ప్రకటనలో కోరారు.

నగరంలోని శ్రీనివాస రెసిడెన్సీ నందు వైశ్యపబ్రోధిని స్వర్ణోత్సవ వేడుకలు

Tags: Applications are invited for the District Level Award for Best Teacher

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *