Natyam ad

పల్లెబాటలో వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలి

— అధికారులు, ప్రజాప్రతినిథులతో సమావేశం
— సమన్వయంతో అభివృద్ది చేయాలి
–అభివృద్దిలో ఆదర్శంగా నిలుద్దాం
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇటీవల మండల పర్యటనలో ప్రజలనుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిష్కరించాలని మంత్రి వ్యక్తిగత సహాయకుడు చంద్రహాస్‌ అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక స్త్రీశక్తి భవనంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ మండలంలో మంత్రి పెద్దిరెడ్డి నాల్గు రోజుల పర్యటనలో ప్రజలనుంచి 220 వివ్యిధ సమస్యలను తెలుపుతూ అర్జీలు వచ్చాయన్నారు. శాఖల వారీగా ఈ సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో అభివృద్ది పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో గ్రామ సచివాలయ సిబ్బంది పనితీరు సక్రమంగా లేదనే ఆరోపణలున్నాయని, జాగ్రత్తగా విధులు నిర్వహించి ప్రజలకు ప్రభుత్వ సేవలు సకాలంలో అందించిప్రభుత్వం•పై నమ్మకం పెంచాలన్నారు. అభివృద్దిపనులు వేగవ ంతం చేసి సకాలంలో పనులు పూర్తిచేసి అభివృద్దిలో ఆదర్శంగా నిలుద్దామని కొనియాడారు.ఈ సమావేశంలో ఎంపీపీ రామమూర్తి, జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు,వైస్‌ ఎంపీపీ నరసింహులు యాదవ్‌,సింగిల్‌విండో చైర్మన్‌ రవిరెడ్డి, బూత్‌ కమిటీ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి,మాజీ జెడ్పిటీసీ రుక్మిణమ్మ, మాజీ ఎంపీపీ రెడ్డిప్రకాష్‌, ఎంపీడీఓ సుధాకర్‌, తహసీల్దార్‌ మాధవరాజుతదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Applications received in the countryside should be addressed immediately

Leave A Reply

Your email address will not be published.