స్పందన  కార్యక్రమంలో  అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తాం నంద్యాల  ఇంచార్జ్ ఆర్ డి ఓ.  సి వెంకట నారాయణమ్మ

నంద్యాలముచ్చట్లు :

 

 

స్పందన   కార్యక్రమంలో అందిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తాం అని
నంద్యాల  ఇంచార్జ్ ఆర్ డి ఓ. సి వెంకట నారాయణమ్మ అన్నారు.
సోమవారం నంద్యాల ఆర్డీవో కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమం లో  నంద్యాల ఇంచార్జ్ ఆర్ డి ఓ. సి. వెంకట నారాయణమ్మ  అర్జీదారుల  నుండి అర్జీలను స్వీకరించారు.
ఇంచార్జి ఆర్ డి ఓ .సి. వెంకట నారాయణమ్మ మాట్లాడుతూ  ఆర్డీవో కార్యాలయంలో స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని అర్జీదారులు అర్జీలు సమర్పించారు. సోమవారం నాడు జరిగిన కార్యక్రమంలో  భూములను సర్వే చేయించాలని. భూములను ఆక్రమించుకున్నారని . ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న చేయూత కార్యక్రమం ద్వారా మాకు లబ్ధి పొందే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ భూములకు సంబంధించి ఆర్ ఓ ఆర్ కేసులు  భూతగాదాలు . మాల మహానాడు వారు కొన్ని అర్జీలను కూడా సమర్పించారని ఆమె అన్నారు. సోమవారం నాడు జరిగిన కార్యక్రమానికి దాదాపుగా పది అర్జీలు అందినాయన్నారు. వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తామన్నారు.

 

పుంగనూరు పోలీసులను ఆశ్రయించిన సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రులు

 

Tags:Applications received in the response program will be processed promptly
Nandyala in-charge RDO. C Venkata Narayanamma

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *