Natyam ad

పుంగనూరు మోడల్‌స్కూల్‌లో ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

 

మండలంలోని అడవినాథునికుంటలో గల ఆదర్శ పాఠశాలలో అడ్మీషన్లకు ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ టిఎన్‌.రమ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-2025 సంవత్సరాలకు 6వ తరగతిలో ప్రవేశం కోరే వారు ఓసీ, బీసీలు రూ.150లు, ఎస్సీ, ఎస్టీలు రూ.75లు చెల్లించి, ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏప్రిల్‌ 21న ప్రవేశ పరీక్షలు పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు ఆదర్శపాఠశాలలో సంప్రదించాలని సూచించారు.

 

Tags: Apply at Punganur Model School

Post Midle
Post Midle