డిగ్రీ కోర్సుల్లో అడ్మీషన్లకు ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రామసముద్రం రోడ్డులో గల శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సుల్లో డి గ్రీ చదివేందుకు ఆసక్తి గల విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వాదేశాల మేరకు మూడు సంవత్సరాల బిఎస్‌సీ, బికాం, సిఏ , బిఏ కోర్సులలో అడ్మీషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. సువిశాలమైన కళాశాల, క్రీడామైదానం, లైబ్రరీతో పాటు అనేక వసతులతో కూడిన కళాశాలలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు జెకెసి నందు ఉచిత శిక్షణ కూడ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

 

Tags: Apply for admissions in degree courses

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *