అంగన్‌వాడీ పోస్టులకు ధరఖాస్తు చేయండి

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరు ఐసిడిఎస్‌ పరిధిలో గల వివిధ అంగన్‌వాడీ ఉద్యోగాలకు ధరఖాస్తు చేయాలని ఐసిడిఎస్‌ పీవో రాజేశ్వరి తె లిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మండలంలోని కొండందొడ్డి, ఏతూరు, బోడేవారిపల్లి, రాంనగర్‌ లలో గల మిని అంగన్‌వాడి కార్యకర్త, అంగన్‌వాడి సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే చౌడేపల్లె మండలం కాటిపేరిలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టు ఖాళీగా ఉందన్నారు. సోమల మండలం ఫిరంగులగొట్టలో మినిఅంగన్‌వాడి కార్యకర్త ఉద్యోగానికి, ముండ్రివారిపల్లెలో సహాయకురాలు పోస్టులకు ధరఖాస్తు చేయాలన్నారు. పదోతరగతి పాసైన వారు ఈనెల 4 నుంచి 19వ తేదీ సాయంత్రం లోపు ధరఖాస్తులు అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

 

 

Tags:Apply for Anganwadi Posts

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *