జర్నలిస్టుల పిల్లల ఉచితవిద్య కోసం దరఖాస్తు చేసుకోండి

అనంతపురం

ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్.అనంతపురం జిల్లాలో జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థలలో ఉచిత విద్య పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( ఏపీయూడబ్ల్యూజే)జిల్లా అధ్యక్షులు పయ్యావుల ప్రవీణ్ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అక్రిడేషన్ పొందిన జర్నలిస్టులు తమ అక్రిడేషన్ జిరాక్స్ తో పాటు విద్యార్థి ఆధార్ కార్డు, స్కూల్ పేరు తదితర వివరాలతో ఏపీయూడబ్ల్యూజే నేతలను కలిసి దరఖాస్తు అందజేయాలని కోరారు. ఈనెల 15వ తేదీలోగా జర్నలిస్టుల పిల్లల వివరాలు స్థానికంగా ఉన్న యూనియన్ నేతలకు అందజేయాలని పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

నియోజకవర్గ వ్యాప్తంగా దరఖాస్తులు అందించాల్సిన ఏపీయూడబ్ల్యూజే నాయకులు

1) అనంతపురం – మల్లికార్జున శర్మ, విశాలాంధ్ర రిపోర్టర్

2). తాడిపత్రి – రంగనాయకులు హెచ్ఎంటీవీ, రిపోర్టర్
3). గుంతకల్ – మహమ్మద్ రఫీ, ఆంధ్రజ్యోతి ఇన్చార్జి
4). ఉరవకొండ – రమేష్, ఆంధ్రజ్యోతి రిపోర్టర్
5). కళ్యాణదుర్గం – లింగాప్రసాద్, వెటరన్ జర్నలిస్ట్
6). రాయదుర్గం – కమలాక్షుడు,వార్త ఇన్చార్జి,

సింగనమల రాప్తాడు నియోజక వర్గాల రిపోర్టర్లు అనంతపురం నేతలను సంప్రదించగలరు.

 

 

Tags:Apply for free education for children of journalists

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *