కాపు నేస్తం పథకానికి దరఖాస్తు చేసుకోండి

ఎమ్ పి డి ఓ రామచంద్రయ్య

Date: 09/12/2019

సోమల ముచ్చట్లు:

వైయస్సార్ కాపు నేస్తం పథకానికి అర్హులైన కాపు మహిళలు దరఖాస్తులు చేసుకోవాలని సోమల ఎంపిడిఓ రామచంద్రయ్య తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వం కాపుల సంక్షేమం కోసం వైఎస్సార్ కాపు నేస్తం పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఈ పథకానికి కాపు మహిళల నుండి 45 సంవత్సరాల వయసు నుంచి 60 సంవత్సరాల వయసు లోపు కలిగి ఉండాలన్నారు. కుటుంబ ఆదాయం నెలకు గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 10,000, పట్టణ ప్రాంతాల వారికి రూ. 12000 లోపు ఉండాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ఆదాయపు పన్ను చెల్లించు వారు అనర్హులని అన్నారు. ఈ నిబంధనలకు వర్తించు అర్హులైన మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సమీపంలోని గ్రామ వాలంటీర్ల ను సంప్రదించాలని సూచించారు.

 

వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య

 

Tags:Apply for the Kapu Nestam scheme

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *