ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి- ఏపీఆర్ఎస్ ప్రిన్సిపాల్ టి స్వాతి

పత్తికొండ ముచ్చట్లు :

ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పత్తికొండ ఏపీఆర్ఎస్ ప్రిన్సిపాల్ స్వాతి చెప్పారు. సోమవారం విలేకరులతో ఆమె మాట్లాడుతూ పత్తికొండ పట్టణంలో ని ఏపీఆర్ఎస్ బాలుర పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయని తెలిపారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు ఈ నెల 30వ తేదీ లోపు పూర్తి వివరాలతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. జూలై 14వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు వివరాలు సక్రమంగా లేకపోతే అర్హులు కారన్నారు. ఆన్లైన్లో దరఖాస్తు పంపిన తరువాత ఒక రెఫరెన్స్ నెంబరు ఇవ్వబడుతుందని తెలియజేశారు. నింపిన దరఖాస్తు నమూనా కాపీని ప్రింట్ తీసుకొని దగ్గర ఉంచుకోవాలని చెప్పారు. దీనితో పాటు ఒక పాస్ ఫోటో సైజు ఫోటోను సిద్ధంగా ఉంచుకోవాలని తెలియజేశారు.

 

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: Apply Online- APRS Principal T Swati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *