Apply online for degree admissions

డిగ్రీ అడ్మీషన్లకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు

Date:26/10/2020

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ వెహోదటి సంవత్సరం అడ్మీషన్లకు ఆన్‌లైన్‌లో ధరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్‌ సుధాకర్‌రెడ్డి సోమవారం తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ యూనివర్శిటి ఆదేశాల మేరకు బిఏ హెచ్‌ఈపి, బికాం జనరల్‌, తెలుగు మీడియంతో పాటు బికాం కంప్యూటర్స్, బిఎస్‌సీ ఎంఎస్‌సీఎస్‌, బిఎస్‌సి క్లౌడ్‌కంప్యూటింగ్‌ కోర్సుకు  ఇంగ్లీష్‌ మీడియంలో అడ్మీషన్లు జరుగుతుందన్నారు. డిగ్రీలో చేరే విద్యార్థిని, విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తులు స్వీకరించి, అడ్మీషన్లు చేపడుతామన్నారు. ఇందుకోసం కళాశాలలో హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేశామన్నారు. ఆసక్తి గల విద్యార్థులు కళాశాలలో వివరాలు పొందాలని, సెల్‌ నెంబర్లు: 944008042, 9440396477 ను సంప్రదించి, వివరాలు పొందాలన్నారు.

మూడు రాజ ధనులకు మద్దతుగా నిరశన దీక్ష

Tags: Apply online for degree admissions

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *