Natyam ad

రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా ఆకేపాటి సుభాషిణి నియామకం

మంగళగిరి  ముచ్చట్లు:

జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పిఎసి) కార్యదర్శిగా ఆకేపాటి సుభాషిణి ని నియమిస్తూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియామక పత్రాలను ఆమెకు స్వయంగా అందించారు. జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి బాటలు వేస్తూ పార్టీని గ్రామస్థాయిలో నుంచి బూత్ లెవెల్ లో సమన్వయ పరచుకుని పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆమెకు సూచించారు. జనసేన పార్టీ లో తొలి నుంచి వీర మహిళ రాష్ట్రస్థాయి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ పెద్ద స్థాయిలో మహిళలను పార్టీలోకి ఆహ్వానించి, తిరుపతి నుంచి రాష్ట్రస్థాయిలో అన్ని ప్రాంతాల్లోనూ కమిటీలు ఏర్పాటు చేయడంలోనూ ఆకేపాటి సుభాషిణి చురుగ్గా వ్యవహరించారు.

 

 

Post Midle

వైఎస్ఆర్సిపి చేస్తున్న జనసేన వ్యతిరేక కార్యక్రమాలను సమర్థవంతంగా అడ్డుకొని మంత్రుల ఆరోపణలకు ధీటుగా సమాధానం చెబుతూ మహిళల్లోనూ ప్రజల్లోనూ జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మకంగా తీసుకువెళ్లే విధంగా ఆకేపాటి సుభాషిణి నిరంతరం కృషి చేశారు. ఆమె పడుతున్న కష్టాన్ని, పార్టీ పట్ల విధేయతను గుర్తించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆమెకు జనసేన పార్టీ లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమించారు.

 

ఈ సందర్భంగా ఆకేపాటి సభాషిని మీడియాతో మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నన్ను జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ కార్యదర్శిగా నియమించిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ..శక్తి వంచనలేకుండా ఇచ్చిన బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తానని శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జనసేన పార్టీని గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు మరింత పటిష్ట పరిచే విధంగా శాయ శక్తులా కృషి చేస్తానని వెల్లడించారు.

 

Tags: Appointing Subhashini as Secretary of Political Affairs Committee

Post Midle