Natyam ad

సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా G.C యోగేశ్వర్ కుమార్  నియామకం

-ప్రధాన కార్యదర్శి గా సురేష్ కుమార్

 

అనంతపురం ముచ్చట్లు:

Post Midle

అనంతపురం జిల్లా కేంద్రం లో ఉపాధ్యాయ భవన్ నందు  Reservation Employees Federationఆర్ ఈ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు  డా, రామచంద్ర  ఆధ్వర్యంలో శ్రీ సత్య సాయి జిల్లా REF కమిటీ వేయడం జరిగింది. అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా జి.సి. యోగేశ్వర్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా సురేష్ కుమార్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. డా,రామచంద్ర  మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన జిల్లా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపి శ్రీ సత్యసాయి  జిల్లాలో ఉద్యోగుల సమస్యల పట్ల పోరాడుతూ ఉద్యోగస్తులకు అండగా నిలవాలని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలతో పనిచేయాలని జిల్లా కమిటీని కోరడం జరిగింది ,అందుకు జిల్లా అధ్యక్షుడు జి.సి.యోగేశ్వర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు ఆదేశానుసారం శ్రీ సత్యసాయి జిల్లాలో  ఉద్యోగస్తుల సమస్యలు ఎప్పటికప్పుడు తమరి దృష్టికి తెస్తూ  జిల్లాలో సమస్యలు పరిష్కరిస్తూ నిరంతరము ఉద్యోగ సమస్యలపై పోరాటం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో REF రాష్ట్ర అధ్యక్షుడు డా, రామచంద్ర, ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు కుళ్లాయప్ప, REF రాయలసీమ జిల్లాల అధ్యక్షులు ఎం.డి.నాగభూషణ, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు వలగొండ రామకృష్ణరాష్ట్ర లీగల్సేల్ అధ్యక్షుడు సాకే నరేష్,జిల్లా ప్రధాన కార్యదర్శి వంక రాజు కాలవ గోవిందరాజులు, ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు లింగమయ్య, తదితర ఆర్ ఈ ఎఫ్ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.

Tags: Appointment of G.C Yogeshwar Kumar as Sathya Sai District President

Post Midle

Leave A Reply

Your email address will not be published.